IND: భారీ మార్పులతో బరిలోకి టీమిండియా
బుమ్రాకు విశ్రాంతి ఖాయం... గాయంతో రిషభ్ పంత్ దూరం... టీమిండియాలో నాలుగు మార్పులు;
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో వెళ్లేందుకు లార్డ్స్‌లో వచ్చిన సువర్ణవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్ట్‌లో 22 పరుగుల స్వల్ప తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో దుమ్మురేపిన భారత బ్యాటింగ్ దళం.. ఈ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. దాంతో ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో ఆడబోయే తుదిజట్టులో భారీ మార్పులకు టీమ్ మేనేజ్మెంట్ తెర తీయనుంది.
బుమ్రాకు విశ్రాంతే
లార్డ్స్ టెస్ట్ ఓటమి నేపథ్యంలో నాలుగో టెస్ట్‌లో టీమిండియా మార్పులు చేయనుంది. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టడం పెట్టొచ్చు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అతనికి విశ్రాంతి ఇచ్చే అవకావం ఉంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కూడా బుమ్రా విశ్రాంతి గురించి ఇదివరకే స్పందించారు. ఇంగ్లాండ్ లో బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని ధృవీకరించారు. బుమ్రా ఇప్పటికే మూడు మ్యాచ్ లల్లో రెండింట్లో ఆడినందున నాలుగో టెస్ట్ కు దూరం పెట్టొచ్చు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్ ఓవల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ కోసం అతన్ని రిజర్వ్ గా ఉంచవచ్చు.
కరుణ్ నాయర్‌పై వేటు
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశం ఉంది. కరుణ్ నాయర్.. 6 అవకాశాలను వృథా చేసుకున్నాడు. 0, 20, 31, 26, 40, 14 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. అద్భుతమైన ఆరంభాలను అందుకున్న వాటిని భారీ స్కోర్లుగా మల్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే మాంచెస్టర్ టెస్ట్ నుంచి కరుణ్ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లో ఒకర్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి.
రిషభ్ పంత్ డౌట్..
లార్డ్స్ టెస్ట్‌లో గాయపడిన రిషభ్ పంత్.. నాలుగో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం కారణంగా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలకపోయాడు. చేతి నొప్పితో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఒక్క చేతితో ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. రిషభ్ పంత్ గాయం తీవ్రతపై ఎలాంటి అప్డేట్ లేదు. నాలుగో టెస్ట్‌కు ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఆలోపు కోలుకుంటే పంత్ ఆడుతాడు. లేదంటే అతని స్థానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి వస్తాడు. మిగతా బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. శుభ్‌మన్ గిల్, జైస్వాల్ బాధ్యతాయుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. 4వ టెస్టు తుదిజట్టులో- జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆడొచ్చు.