IND vs AUS: తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం

ఏడు వికెట్ల తేడాతో కంగారుల విజయం... తేలిపోయిన టీమిండియా బ్యాటర్లు... వర్షం వల్ల పలుమార్లు ఆటకు అంతరాయం ##

Update: 2025-10-20 03:00 GMT

ఆస్ట్రే­లి­యా­తో మూడు వన్డేల సి­రీ­స్‌­లో భా­గం­గా పె­ర్త్‌ వే­ది­క­గా జరు­గు­తు­న్న తొలి మ్యా­చ్‌­లో భా­ర­త్‌ ఓటమి పా­లైం­ది. 7 వి­కె­ట్ల తే­డా­తో ఆస్ట్రే­లి­యా వి­జ­యం సా­ధిం­చిం­ది. మ్యా­చ్‌­కు వర్షం పలు­మా­ర్లు ఆటం­కం కలి­గిం­చ­డం­తో ఆటను 26 ఓవ­ర్ల­కు కు­దిం­చా­రు. ముం­దు­గా టాస్ ఓడి బ్యా­టిం­గ్‌­కు ది­గిన టీ­మ్ఇం­డి­యా ని­ర్ణీత ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 136 పరు­గు­ల­కే పరి­మి­త­మైం­ది. అనం­త­రం డక్‌­వ­ర్త్ లూ­యి­స్ ప్ర­కా­రం ఆస్ట్రే­లి­యా­కు 131 పరు­గుల లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చ­గా, 21.1 ఓవ­ర్ల­లో ఛే­దిం­చిం­ది. ఓపె­న­ర్‌ మి­చె­ల్‌ మా­ర్ష్‌ (46*) కీలక ఇన్నిం­గ్స్‌ ఆడగా, ఫి­లి­ప్పే (37) ఆక­ట్టు­కు­న్నా­డు. రెన్ షా (21*) పరు­గు­లు చే­య­గా, ట్రా­వి­స్ హెడ్ (8), మా­థ్యూ షా­ర్ట్ (8)పరు­గు­ల­కే ఔట్ అయ్యా­రు. ఇక భా­ర­త్‌ బౌ­ల­ర్ల­లో అర్ష­దీ­ప్‌, అక్ష­ర్‌, వా­షిం­గ్ట­న్‌ సుం­ద­ర్‌ తలో వి­కె­ట్‌ తీ­శా­రు. ఇక రెం­డో వన్డే గు­రు­వా­రం జర­గ­నుం­ది.

పటేల్‌, రాహుల్ ఇద్దరే..

తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన టీ­మ్ఇం­డి­యా బ్యా­ట­ర్ల­లో కే­ఎ­ల్ రా­హు­ల్ (38; 31 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, 2 సి­క్స్‌­లు) టాప్ స్కో­ర­ర్. అక్ష­ర్ పటే­ల్ (31) ఫర్వా­లే­ద­ని­పిం­చా­డు. వి­రా­ట్ కో­హ్లీ డకౌ­ట్‌ కాగా.. రో­హి­త్‌ శర్మ (8), శు­భ్‌­మ­న్ గిల్ (10), శ్రే­య­స్ అయ్య­ర్ (11), వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ (10), ని­తీ­శ్ రె­డ్డి (19*) పరు­గు­లు చే­శా­రు. ఆస్ట్రే­లి­యా బౌ­ల­ర్ల­లో హే­జి­ల్‌­వు­డ్, మి­చె­ల్ ఓవె­న్, కు­నె­మ­న్ రెం­డే­సి వి­కె­ట్లు పడ­గొ­ట్ట­గా.. మి­చె­ల్ స్టా­ర్క్, నా­థ­న్ ఎలి­స్‌­కు చెరో వి­కె­ట్ దక్కిం­ది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రో-కో ద్వయం తీవ్రంగా నిరాశపరించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ (8) పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా షాట్లు ఆడి ఇబ్బందులు పడ్డాడు. స్టా­ర్క్‌ వే­సిన తొలి ఓవ­ర్‌­లో ఒకటే పరు­గు తీ­సిన రో­హి­త్‌, ఆ తర్వాత మూడో ఓవ­ర్‌­లో ఒక ఫో­ర్‌ మా­త్ర­మే బా­దా­డు. అనం­త­రం హే­జి­ల్‌­వు­డ్‌ బౌ­లిం­గ్‌­లో బంతి ఎడ్జ్‌ తీ­సు­కు­ని రె­న్‌­షా చే­తు­ల్లో­కి వె­ళ్ల­డం­తో 14 బం­తు­లు ఆడిన రో­హి­త్‌ వె­ను­ది­రి­గా­డు. మరో­వై­పు వన్డే జట్టు­కు నూతన సా­ర­థి­గా వచ్చిన శు­భ్‌­మ­న్‌ గిల్ తొలి మ్యా­చ్​­లో­నే ఇబ్బం­ది పడ్డా­డు. ఒత్తి­డి­కి గురై అన­వ­స­రం­గా లె­ఫ్ట్ సైడ్ వె­ళ్లిన బం­తి­ని ఆడి కే­వ­లం 10 పర­గు­ల­కే వె­ను­ది­రి­గా­డు. వన్డే­ల్లో ఈ టా­ప్​-3 బ్యా­ట­ర్లు తక్కువ పరు­గు­లు చే­య­డం ఇదే తొ­లి­సా­రి. ఈ మ్యా­చ్‌­లో ము­గ్గు­రు కలి­పి 18 పరు­గు­లే చే­శా­రు. అం­త­కు­ముం­దు పా­క్‌­పై 25 పరు­గు­లు (రో­హి­త్ 11, గిల్ 10, కో­హ్లీ 4) చే­శా­రు. ఆస్ట్రే­లి­యా­తో మూడు వన్డేల సి­రీ­స్‌­లో భా­గం­గా పె­ర్త్‌ వే­ది­క­గా జరు­గు­తు­న్న తొలి మ్యా­చ్‌­లో భా­ర­త్‌ ఓటమి పా­లైం­ది. 7 వి­కె­ట్ల తే­డా­తో ఆస్ట్రే­లి­యా వి­జ­యం సా­ధిం­చిం­ది. మ్యా­చ్‌­కు వర్షం పలు­మా­ర్లు ఆటం­కం కలి­గిం­చ­డం­తో ఆటను 26 ఓవ­ర్ల­కు కు­దిం­చా­రు. ముం­దు­గా టాస్ ఓడి బ్యా­టిం­గ్‌­కు ది­గిన టీ­మ్ఇం­డి­యా ని­ర్ణీత ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 136 పరు­గు­ల­కే పరి­మి­త­మైం­ది. అనం­త­రం డక్‌­వ­ర్త్ లూ­యి­స్ ప్ర­కా­రం ఆస్ట్రే­లి­యా­కు 131 పరు­గుల లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చ­గా, 21.1 ఓవ­ర్ల­లో ఛే­దిం­చిం­ది. ఓపె­న­ర్‌ మి­చె­ల్‌ మా­ర్ష్‌ (46*) కీలక ఇన్నిం­గ్స్‌ ఆడగా, ఫి­లి­ప్పే (37) ఆక­ట్టు­కు­న్నా­డు. రెన్ షా (21*) పరు­గు­లు చే­య­గా, ట్రా­వి­స్ హెడ్ (8), మా­థ్యూ షా­ర్ట్ (8)పరు­గు­ల­కే ఔట్ అయ్యా­రు. ఇక భా­ర­త్‌ బౌ­ల­ర్ల­లో అర్ష­దీ­ప్‌, అక్ష­ర్‌, వా­షిం­గ్ట­న్‌ సుం­ద­ర్‌ తలో వి­కె­ట్‌ తీ­శా­రు. ఇక రెం­డో వన్డే గు­రు­వా­రం జర­గ­నుం­ది.

చెలరేగిన ఫిలిప్

131 ప‌­రు­గుల ల‌­క్ష్య ఛే­ద­‌­న­‌­లో ఆసీ­స్‌­కు ఆది­లో­నే షా­కు­లు త‌­గి­లా­యి. 8 ప‌­రు­గు­లు చే­సిన ట్రా­వి­స్ హె­డ్‌­ను అర్ష్‌­దీ­ప్ సిం­గ్ ఔట్ చే­య­‌­గా, మా­థ్యూ­షా­ట్ (8) అక్ష­‌­ర్ ప‌­టే­ల్ వె­న­‌­క్కి పం­పిం­చ­‌­డం­తో ఆసీ­స్ 44 ప‌­రు­గు­ల­‌­కే రెం­డు వి­కె­ట్లు కో­ల్పో­యి క‌­ష్టా­ల్లో ప‌­డిం­ది. ఈ ద‌­శ­లో మి­చె­ల్ మా­ర్ష్, జోష్ ఫి­లి­ప్‌­లు ఇన్నిం­గ్స్‌­ను చ‌­క్క­‌­ది­ద్దే బా­ధ్య­‌­త­‌­ల­‌­ను భు­జాన వే­సు­కు­న్నా­రు. వీ­రి­ద్ద­‌­రు తొ­లుత ఆచి­తూ­చి ఆడా­రు. కు­దు­రు­కు­న్నాక భా­ర­‌త బౌ­ల­‌­ర్ల­‌­పై వి­రు­చు­కు­ప­‌­డ్డా­రు. వీ­రి­ద్ద­‌­రు మూడో వి­కె­ట్ కు 55 ప‌­రు­గు­లు జో­డిం­చా­రు. ప్ర­‌­మా­ద­‌­క­‌­రం­గా మా­రిన ఈ జో­డి­ని ఫి­లి­ప్‌­ను ఔట్ చే­య­‌­డం ద్వా­రా వా­షిం­గ్ట­‌­న్ సుం­ద­‌­ర్ వి­డ­‌­గొ­ట్టా­డు. ఫి­లి­ప్ ఔటై­నా మాట్ రె­న్షా(21 నా­టౌ­ట్‌)తో క‌­లి­సి మి­చె­ల్ మా­ర్ష్ జ‌­ట్టు­ను వి­జ­‌­య­‌­తీ­రా­ల­‌­కు చే­ర్చా­డు. ఈ ఏడా­ది వన్డే­ల్లో భా­ర­త్‌­కి­ది తొలి ఓటమి. వరు­స­గా ఎని­మి­ది వి­జ­యాల తర్వాత టీ­మ్ఇం­డి­యా పరా­జ­యం చవి­చూ­సిం­ది. 1 ప‌­రు­గుల ల‌­క్ష్య ఛే­ద­‌­న­‌­లో ఆసీ­స్‌­కు ఆది­లో­నే షా­కు­లు త‌­గి­లా­యి. 8 ప‌­రు­గు­లు చే­సిన ట్రా­వి­స్ హె­డ్‌­ను అర్ష్‌­దీ­ప్ సిం­గ్ ఔట్ చే­య­‌­గా, మా­థ్యూ­షా­ట్ (8) అక్ష­‌­ర్ ప‌­టే­ల్ వె­న­‌­క్కి పం­పిం­చ­‌­డం­తో ఆసీ­స్ 44 ప‌­రు­గు­ల­‌­కే రెం­డు వి­కె­ట్లు కో­ల్పో­యి క‌­ష్టా­ల్లో ప‌­డిం­ది. ఈ ద‌­శ­లో మి­చె­ల్ మా­ర్ష్, జోష్ ఫి­లి­ప్‌­లు ఇన్నిం­గ్స్‌­ను చ‌­క్క­‌­ది­ద్దే బా­ధ్య­‌­త­‌­ల­‌­ను భు­జాన వే­సు­కు­న్నా­రు. వీ­రి­ద్ద­‌­రు తొ­లుత ఆచి­తూ­చి ఆడా­రు. కు­దు­రు­కు­న్నాక భా­ర­‌త బౌ­ల­‌­ర్ల­‌­పై వి­రు­చు­కు­ప­‌­డ్డా­రు. వీ­రి­ద్ద­‌­రు మూడో వి­కె­ట్ కు 55 ప‌­రు­గు­లు జో­డిం­చా­రు. ప్ర­‌­మా­ద­‌­క­‌­రం­గా మా­రిన ఈ జో­డి­ని ఫి­లి­ప్‌­ను ఔట్ చే­య­‌­డం ద్వా­రా వా­షిం­గ్ట­‌­న్ సుం­ద­‌­ర్ వి­డ­‌­గొ­ట్టా­డు. ఫి­లి­ప్ ఔటై­నా మాట్ రె­న్షా(21 నా­టౌ­ట్‌)తో క‌­లి­సి మి­చె­ల్ మా­ర్ష్ జ‌­ట్టు­ను వి­జ­‌­య­‌­తీ­రా­ల­‌­కు చే­ర్చా­డు. ఈ ఏడా­ది వన్డే­ల్లో భా­ర­త్‌­కి­ది తొలి ఓటమి. వరు­స­గా ఎని­మి­ది వి­జ­యాల తర్వాత టీ­మ్ఇం­డి­యా పరా­జ­యం చవి­చూ­సిం­ది.

Tags:    

Similar News