IND vs AUS: సమం చేస్తారా..? గెలిచేస్తారా..?

ఆస్ట్రేలియాతో నేడే భారత్ చివరి టీ 20 మ్యాచ్.. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. గబ్బా వేదికగా బరిలోకి దిగుతున్న ఇరు జట్లు... టీ 20 సిరీస్ పట్టేయాలన్న పట్టుదలతో భారత్

Update: 2025-11-08 06:30 GMT

ఆస్ట్రే­లి­యా­తో ఐదు టీ20ల సి­రీ­స్‌­లో 2-1తో ఆధి­క్యం­లో ని­లి­చిన భారత జట్టు ఆఖరి పో­రు­కు సి­ద్ద­మైం­ది. నేడు బ్రి­స్బే­న్ వే­ది­క­గా జరి­గే మ్యా­చ్‌­లో ఆతి­థ్య ఆసీ­స్‌­తో అమీ­తు­మీ తే­ల్చు­కో­నుం­ది. నా­లు­గో టీ20లో అద్భుత వి­జ­యా­న్ని అం­దు­కు­న్న టీ­మిం­డి­యా ఆఖరి మ్యా­చ్‌­లో­నూ అదే జోరు కొ­న­సా­గిం­చి సి­రీ­స్ కై­వ­సం చే­సు­కో­వా­ల­ను­కుం­టుం­ది. మరో­వై­పు యా­షె­స్ సి­రీ­స్ నే­ప­థ్యం­లో సీ­ని­య­ర్లు దూ­ర­మైన వేళ యువ ప్లే­య­ర్ల­తో ఆడు­తు­న్న ఆసీ­స్.. సి­రీ­స్ సమం చే­య­డం­పై కన్నే­సిం­ది. టీ20 ప్ర­పం­చ­క­ప్ 2026 సన్నా­హ­కం­లో భా­గం­గా ఆఖరి మ్యా­చ్‌­లో­నూ మా­ర్పు­లు చేసే అవ­కా­శం ఉంది. బ్యా­టిం­గ్ ఆల్‌­రౌం­డ­ర్ ని­తీ­ష్ కు­మా­ర్ రె­డ్డి­తో పాటు సంజూ శాం­స­న్‌­‌­ను తుది జట్టు­లో­కి తీ­సు­కు­నే ఛా­న్స్ ఉంది. ఈ ఇద్ద­రి కోసం వైస్ కె­ప్టె­న్ శు­భ్‌­మ­న్ గి­ల్‌­తో పాటు శి­వ­మ్ దూ­బే­కు వి­శ్రాం­తి ఇవ్వ­వ­చ్చు.

బ్యాటర్లు జూలు విదిలించాల్సిందే

భా­ర­త్ గత రెం­డు మ్యా­చ్‌­ల్లో బ్యా­టిం­గ్ పరం­గా అం­చ­నా­ల­ను అం­దు­కో­లే­క­పో­యిం­ది. మూడో టీ20లో సుం­ద­ర్ రా­ణిం­చి జట్టు­ను గె­లి­పిం­చ­గా.. నా­లు­గో టీ20లో గె­లు­పు క్రె­డి­ట్ బౌ­ల­ర్ల­కే దక్కు­తుం­ది. అభి­షే­క్, గిల్, సూ­ర్య, తి­ల­క్ తమ స్థా­యి ప్ర­ద­ర్శన చే­య­లే­క­పో­తు­న్నా­రు. దూ­కు­డు­గా ఆడే క్ర­మం­లో త్వ­ర­గా­నే అవు­ట­వు­తు­న్నా­రు. ఆఖరి మ్యా­చ్‌­లో వీ­ళ్లు కీలక ఇన్నిం­గ్స్‌­లు ఆడా­ల్సిన అవ­స­రం ఉంది. ఆల్‌­రౌం­డ­ర్లు అక్ష­ర్ పటే­ల్, సుం­ద­ర్ రా­ణి­స్తూ జట్టు వి­జ­యా­ల్లో భా­గ­మ­వు­తు­న్నా­రు. నా­లు­గో టీ20లో 167 పరు­గుల తక్కువ స్కో­రే చే­సి­న­ప్ప­టి­కీ ఆసి­స్‌­ను ని­లు­వ­రిం­చిన తీరు భారత బౌ­లిం­గ్ దళం బలా­న్ని తె­లి­య­జే­స్తోం­ది.

పేసర్లపైనే బాధ్యత

నా­లు­గో టీ20లో ఆస్ట్రే­లి­యా­ను స్పి­న్‌­తో­నే కొ­ట్టిం­ది భా­ర­త్‌. ఈసా­రి బా­ధ్యత పే­స­ర్ల­దే. పే­స్‌­కు అను­కూ­ల­మైన బ్రి­స్బే­న్‌ పి­చ్‌­పై బు­మ్రా, అర్ష్‌­దీ­ప్‌ సిం­గ్‌ కీ­ల­కం కా­ను­న్నా­రు. అర్ష్‌­దీ­ప్‌ జోరు మీద ఉం­డ­డం సా­ను­కూ­లాం­శం. అతడు బు­మ్రా­తో కలి­సి గబ్బా­లో దూ­కు­డు కొ­న­సా­గి­స్తే ప్ర­త్య­ర్థి బ్యా­ట­ర్ల­కు ఆరం­భం­లో­నే కళ్లెం వే­య­చ్చు. పే­స్‌ ఆల్‌­రౌం­డ­ర్‌ శి­వ­మ్‌ దూబె ప్ర­ద­ర్శన జట్టు­కు ము­ఖ్య­మే. గత మ్యా­చ్‌­లో ఆడిన జట్టు­నే భా­ర­త్‌ కొ­న­సా­గిం­చొ­చ్చు. వరు­ణ్‌ చక్ర­వ­ర్తి­తో పాటు.. అక్ష­ర్, సుం­ద­ర్‌ జట్టు­లో కొ­న­సా­గ­ను­న్నా­రు. టీ20 ప్ర­పం­చ­క­ప్ 2026 సన్నా­హా­ల్లో భా­గం­గా ఈ సి­రీ­స్‌­ను టీ­మిం­డి­యా ప్ర­యో­గా­ల­కు ఉప­యో­గిం­చు­కుం­ది. 

Tags:    

Similar News