INDIA vs ENG: రాణించిన టాపార్డర్

తొలి రోజు పర్వాలేదనిపించిన టీమిండియా... నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసిన భారత్;

Update: 2025-07-24 02:30 GMT

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 264 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (19*; 37 బంతుల్లో 3 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్ (19*; 36 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ (61; 151 బంతుల్లో 7 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (58; 107 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశారు. కేఎల్ రాహుల్ (46; 98 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. రిషబ్ పంత్ (37*; 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాటింగ్ చేస్తుండగా కాలికి తీవ్రగాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (12) నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, క్రిస్ వోక్స్, లియామ్‌ డాసన్ చెరో వికెట్ తీశారు.

టీ బ్రేక్‌ సెషన్.. ఇంగ్లాండ్ ఆధిపత్యం..

ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట కొనసాగుతోంది. 78/0తో రెండో సెషన్ ఆరంభించిన టీమిండియా.. టీ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఈ సెషన్‌లో 26 ఓవర్లు ఆడిన భారత్ 71 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే కేఎల్ రాహుల్ (46; 98 బంతుల్లో 4 ఫోర్లు) క్రిస్‌ వోక్స్ బౌలింగ్‌లో థర్డ్ స్లిప్‌లో జాక్‌ క్రాలీకి చిక్కి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ (58; 107 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న యశస్వి.. స్పిన్నర్ లియామ్ డాసన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిరాశపరిచాడు. బెన్ స్టోక్స్ వేసిన 49.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అతడు రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. భోజన విరామ సమయానికి వికెట్‌ నష్టపోకుండా భారత్ 78 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (40*; 82 బంతుల్లో 4 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (36*; 74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడారు.

భారత్ తుది జట్టులో 3 మార్పులు

నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఆకాశ్‌ దీప్, అర్ష్‌దీప్ సింగ్ గాయాల బారినపడటంతో కొత్తగా టీమ్‌లోకి వచ్చిన పేసర్ అంశుల్ కాంబోజ్ భారత్ తరఫున తొలి మ్యాచ్‌ ఆడే ఛాన్స్ దక్కింది. జిమ్‌లో గాయపడి సిరీస్‌ మొత్తానికి దూరమైన నితీశ్‌ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక, వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్‌పై వేటు వేసి సాయి సుదర్శన్‌కు అవకాశమిచ్చారు.

Tags:    

Similar News