T20: ఇంగ్లండ్ బౌలర్లను షేక్ ఆడించిన అభిషేక్
అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా సూపర్ విక్టరీ;
ఐదో టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. ముంబై వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే అలౌట్ అయ్యింది. సాల్ట్ మాత్రమే 55 పరుగులతో రాణించారు. ఈ మ్యాచులో అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7×4, 13×6) వీరవిహారం చేయడంతో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్ 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్.. షమి (3/25), వరుణ్ చక్రవర్తి (2/25), దూబె (2/11), అభిషేక్ (2/3) ధాటికి 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. సాల్ట్ (55; 23 బంతుల్లో 7×4, 3×6) టాప్ స్కోరర్. అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యారు.
ఊచకోత కోసిన అభిషేక్
అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షంతో వాంఖడేను ముంచేశాడు. ఆర్చర్ ఓవర్లో అభిషేక్ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. 17 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. కేవలం17 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇందులో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. తర్వత కూడా అదే దూకుడు కొనసాగించిన అభిషేక్... 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో శతకం సాధించాడు. ఇది అతడికి రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీ. కాగా.. శర్మ.. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. తిలక్ (15 బంతుల్లో 24), సూర్య (2) వెంటవెంటనే ఔటైనా.. దూబె (30; 13 బంతుల్లో 3×4, 2×6) బ్యాట్ ఝళిపించాడు. అభిషేక్ 37 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ ఔటయ్యాడు. ఆఖరి రెండు ఓవర్లలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు (13) కొట్టిన భారత బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు.
టీ20 ఫార్మాట్: అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాళ్లు వీరే
అభిషేక్ శర్మ - 135 పరుగులు (ఇంగ్లాండ్ పై)
శుభ్మన్ గిల్ - 126*పరుగులు (న్యూజిలాండ్ పై)
రుతురాజ్ గైక్వాడ్ - 123* పరుగులు
(ఆస్ట్రేలియా పై)
విరాట్ కోహ్లి - 122* పరుగులు (ఆఫ్గనిస్థాన్ పై)
రోహిత్ శర్మ - 121* పరుగులు (ఆఫ్గనిస్థాన్ పై)