IND vs SA: నేడే రెండో టీ 20..జోరు మీద భారత్

రెండో టీ 20కు భారత జట్టు సిద్ధం.. విజయంపై కన్నేసిన టీమిండియా... గెలిచి తీరాలన్న చూస్తున్న ప్రొటీస్... ఆందోళన కలిగిస్తున్న సూర్య ఫామ్

Update: 2025-12-11 04:30 GMT

టీ20 సి­రీ్‌­స­ను అది­రే వి­జ­యం­తో ఆరం­భిం­చిన భా­ర­త్‌.. అదే జో­రు­ను కొ­న­సా­గిం­చా­ల­ను­కొం­టోం­ది. ఐదు మ్యా­చ్‌ల సి­రీ్‌­స­లో భా­గం­గా గు­రు­వా­రం దక్షి­ణా­ఫ్రి­కా­తో జరి­గే రెం­డో టీ20లోనూ గె­లు­పే లక్ష్యం­గా బరి­లో­కి ది­గ­నుం­ది. కట­క్‌­లో జరి­గిన మొ­ద­టి మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా అద­ర­గొ­ట్టి­నా.. ఓపె­న­ర్‌ శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ వై­ఫ­ల్యం మరో­సా­రి చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. గా­యం­తో వన్డే సి­రీ్‌­స­కు దూ­ర­మైన అతడు తగిన వి­శ్రాం­తి తర్వాత బరి­లో­కి ది­గి­నా.. స్వ­ల్ప స్కో­రు­కే వె­ను­ది­రి­గా­డు. ము­ఖ్యం­గా అభి­షే­క్‌ శర్మ­కు అతడు ఏమా­త్రం సరి­తూ­గ­డం లేదు. గి­ల్‌ రా­క­తో సంజూ శాం­స­న్‌­కు తుది జట్టు­లో చోటు కష్ట­మ­వు­తుం­డ­డం కూడా అత­డి­పై ఒత్తి­డి­కి కా­ర­ణ­మ­వు­తోం­ది. తొలి మ్యా­చ్‌­లో వి­ఫ­ల­మైన జి­తే­ష్‌ శర్మ­కు బదు­లు­గా సంజూ శాం­స­న్‌­ను తీ­సు­కో­వా­ల­ని సో­ష­ల్‌­మీ­డి­యా­లో చర్చ మొ­ద­లైం­ది. కీ­ప­ర్‌ బె­ర్త్‌ కోసం వీ­రి­ద్ద­రి మధ్య తీ­వ్ర­మైన పోటీ ఏర్ప­డిం­ది. ఇక, కె­ప్టె­న్‌ సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ ఫా­మ్‌­పై కూడా ఆం­దో­ళన నె­ల­కొం­ది. పొ­ట్టి వర­ల్డ్‌­క­ప్‌ నే­ప­థ్యం­లో సూ­ర్య తన ము­ను­ప­టి వి­ధ్వం­స­కర బ్యా­టిం­గ్‌ కోసం ఫ్యా­న్స్‌ ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. అయి­తే, గాయం నుం­చి కో­లు­కొ­న్న హా­ర్ది­క్‌ పాం­డ్యా ఆడిన తొలి మ్యా­చ్‌­లో­నే అజేయ అర్ధ శత­కం­తో అద­ర­గొ­ట్టా­డు. అతడి నుం­చి జట్టు ఇదే తరహా ఇన్నిం­గ్స్‌­ను జట్టు ఆశి­స్తోం­ది. అయి­తే, బ్యా­టిం­గ్‌ డె­ప్త్‌ కా­వా­ల­ను­కొం­టే అర్ష్‌­దీ­ప్‌ స్థా­నం­లో హర్షి­త్‌ రా­ణా­ను తీ­సు­కొ­నే చా­న్సు­లు­న్నా­యి. ఒక­వేళ పి­చ్‌ పొ­డి­గా ఉంటే మా­త్రం జట్టు­లో ఎటు­వం­టి మా­ర్పు­లూ ఉండే అవ­కా­శం లేదు. మరో­వై­పు దక్షి­ణా­ఫ్రి­కా బలం­గా పుం­జు­కో­వా­ల­ను­కొం­టోం­ది. బ్రె­వి­స్‌ మి­న­హా మి­గ­తా బ్యా­ట­ర్లు వి­ఫ­లం కా­వ­డం జట్టు­ను కల­వ­ర­పె­డు­తోం­ది.

 పట్టుదలతో..

తొలి మ్యా­చ్‌­లో ఘో­ర­ప­రా­జ­యం చవి­చూ­సిన దక్షి­ణా­ఫ్రి­కా.. లె­క్క సరి­చే­యా­ల­నే పట్టు­ద­ల­తో ఉంది. ఆ జట్టు­ను భా­ర­త్‌ తే­లి­క­గా తీ­సు­కుం­టే పొ­ర­పా­టే. అయి­తే సి­రీ­స్‌­ను సమం చే­యా­లం­టే బ్యా­టు­తో సఫా­రీ జట్టు గణ­నీ­యం­గా మె­రు­గు­ప­డా­ల్సి­వుం­ది. కట­క్‌­లో ఆ జట్టు 74 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిన సం­గ­తి తె­లి­సిం­దే. స్పి­న్న­ర్లు వరు­ణ్‌ చక్ర­వ­ర్తి, అక్ష­ర్‌ పటే­ల్‌­ను ఎదు­ర్కో­వ­డం దక్షి­ణా­ఫ్రి­కా బ్యా­ట­ర్ల­కు సవా­లే.

కె­ప్టె­న్‌ సూ­ర్య­కు­మా­ర్‌ ఫా­మ్‌ కూడా ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. గత ఏడా­ది కా­లం­గా ని­ల­క­డ­గా ఆడ­లే­క­పో­తు­న్న అత­డి­పై­నే ఇప్పు­డు అం­ద­రి దృ­ష్టీ ఉంది. ఇం­కొ­న్ని నె­ల­ల్లో టీ20 ప్ర­పం­చ­క­ప్‌­లో సూ­ర్య జట్టు­ను నడి­పిం­చ­ను­న్న నే­ప­థ్యం­లో అతడు పరు­గుల బాట పట్ట­డం చాలా అవ­స­రం. కట­క్‌­లో అతడు 12 పరు­గు­లే చే­శా­డు. పేలవ ఫా­మ్‌­ను అధి­గ­మిం­చ­డా­ని­కి సూ­ర్య­కు ఈ సి­రీ­స్‌ ది చక్క­ని అవ­కా­శం. రెం­డో టీ20 కోసం తుది జట్టు­లో టీ­మ్‌­ఇం­డి­యా ఎలాం­టి మా­ర్పు­లు చేసే అవ­కా­శం లేదు. ఆల్‌­రౌం­డ­ర్‌ హా­ర్ది­క్‌ పాం­డ్య పు­న­రా­గ­మ­నం­లో తొలి మ్యా­చ్‌­లో­నే చె­ల­రే­గ­డం భా­ర­త్‌­కు సం­తో­షా­న్ని­స్తోం­ది. కట­క్‌­లో కే­వ­లం 28 బం­తు­ల్లో­నే అజే­యం­గా 59 పరు­గు­లు చే­సిన అతడు.. మరో­సా­రి మె­ర­వా­ల­ని జట్టు కో­రు­కుం­టోం­ది. ఇంకా అభి­షే­క్‌ శర్మ, తి­ల­క్‌ వర్మ, అక్ష­ర్‌ పటే­ల్, దూబె, జి­తే­శ్‌ శర్మ­ల­తో టీ­మ్‌­ఇం­డి­యా బ్యా­టిం­గ్‌ లై­న­ప్‌ చాలా బలం­గా కని­పి­స్తోం­ది. ఇక బౌ­ల­ర్లు గత మ్యా­చ్‌­లో సమ­ష్టి­గా వి­జృం­భిం­చ­డం భా­ర­త్‌­కు సా­ను­కూ­లాం­శ­మే. పే­స­ర్లు బు­మ్రా, అర్ష్‌­దీ­ప్‌­తో పాటు స్పి­న్న­ర్లు వరు­ణ్‌ చక్ర­వ­ర్తి, అక్ష­ర్‌.. సఫా­రీ జట్టు­ను దె­బ్బ­తీ­శా­రు.

Tags:    

Similar News