IPL: రావల్పిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి

పాక్ క్రికెట్ స్డేడియంపై డ్రోన్ దాడి,... పీఎస్‌ఎల్ రద్దయ్యే అవకాశం;

Update: 2025-05-09 02:00 GMT

పాకిస్థాన్ సైన్యం.. సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడడంతో పాటు మిస్సైళ్ల దాడి చేస్తోంది. ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత్ సైన్యం యాంటీ మిసైల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియానికి సమీపంలో ఓ డ్రోన్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది. స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై డ్రోన్ పడగా.. పలువురు గాయపడ్డారు. ఈ డ్రోన్ ఐపీఎల్ 2025 మ్యాచ్‌కు ముందు కుప్పకూలడంతో పీసీబీ బయపడిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ కూలింది. ఈ డ్రోన్ ప్రమాదం పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి కొన్ని గంటల ముందే చోటు చేసుకుంది. భారత్ దాడితో పీసీబీ వణికిపోయింది. పీఎస్‌ఎల్ 2025 మ్యాచ్‌లను ఉన్నపళంగా కరాచీకి మార్చింది. గురువారం రాత్రి 8 గంటలకు రావల్పిండిలో పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ భద్రతా పరిస్థితులపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.

పీసీబీ కీలక ఆదేశం

రావిల్పిండి స్టేడియంకు దగ్గర్లోనే బాంబు దాడి జరగడంతో క్రికెటర్లు ఎవరూ రావల్పిండిలో ఉండవద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి పలు దేశాలకు చెందిన క్రికెటర్లు పీసీఎల్ కోసం పాకిస్తాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను రద్దు చేయడం లేదా వేదికలను మార్చడం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకు న్న పాక్‌.. ఇటీవలే భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్టేడియాలను పునరుద్ధరించింది.

Tags:    

Similar News