శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. టోర్నీలో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. శనివారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-౦ గోల్స్ తేడాతో నిలిచింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ కొట్టిన భారత కెప్టెన్, స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రీ ఈ మ్యాచ్‌లో కూడా ఒక గోల్ చేశాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో 4వ స్థానంలో నిలిచాడు. 6 పాయింట్లతో ఇదే గ్రూప్ నుంచి కువైట్ కూడా సెమీఫైనల్లో స్థానం ఖాయం చేసుకుంది. మంగళవారం చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, కువైట్‌లు తలపడనున్నాయి. వరుస పరాజయాలతో పాకిస్థాన్, నేపాల్‌లు ఇంటి ముఖం పట్టాయి.
నేపాల్ మొదటి అర్ధభాగంలో చాలా బాగా ఆడి, గోల్స్ చేసే అవకాశాల్ని చేజార్చుకుంది. 34వ నిమిషంలో వచ్చిన మంచి అవకాశానికి భారత ఆటగాడు రోహిత్ కుమార్ అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో మొదటి అర్ధభాగం ముగిసేసరిగి గోల్స్ లేకుండానే విరామానికి వెళ్లారు.
అయితే 2వ అర్థభాగంలో భారత ఆటగాళ్లు దూకుడు పెంచి ప్రత్యర్థి ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారు. 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్‌కు గోల్ అందించి లీడ్ అందించాడు. అనంతరం 70వ నిమిషం వద్ద భారత ఆటగాడు మహేష్ సింగ్ హెడర్‌తో బాల్‌ని గోల్‌పోస్ట్‌లోకి పంపి భారత్‌కు 2-౦ ఆధిక్యం అందించాడు. నేపాల్ ఆటగాళ్లు అంజన్, ఆరిక్ బిస్తాలు గాయాలో మైదాన్ని వీడటం కూడా భారత్‌కు లాభించింది. తర్వాత నేపాల్ ఆటగాళ్లు గోల్ చేయాడానికి తీవ్రంగా ఒత్తిడి పెంచినా భారత రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు.
ఆటగాళ్ల మధ్య మళ్లీ గొడవ..
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య ఘర్షణను మరవకముందే, ఈ మ్యాచ్‌లో 64వ నిమిషంలో ఆటగాళ్లు మళ్లీ ఈ మ్యాచ్‌లో కూడా తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. రిఫరీ కలగజేసుకోవడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.