IND vs AUS: నిలిచిన ఆసిస్ టెయిలెండర్లు
ముగిసిన నాలుగో రోజు ఆట... రసవత్తరంగా నాలుగో టెస్టు;
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 228/9 పరుగులు చేసింది. దీంతో 333 పరుగుల లీడ్‌లో ఉంది. ప్రస్తుతం నాథన్ లైయన్(41*), బోలాండ్ (10*) క్రీజులో ఉన్నారు. కమిన్స్ 41, లబుషేన్ 70 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474, భారత్ 369 పరుగులు చేసింది. . పదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించిన నాథన్ లైయన్ (41*), స్కాట్ బోలాండ్ (10*)ను అడ్డుకొనేందుకు బౌలర్లు విఫలయత్నం చేశారు. మెల్‌బోర్న్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అంతకుముందు మార్నస్ లబుషేన్ (70), పాట్ కమిన్స్ (41) రాణించారు. టీమ్ ఇండియా బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది.
బుమ్రా అరుదైన రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు 4వ రోజు ఆటలో భారత పేసర్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 44 మ్యాచ్‌ల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు తీశాడు. మరోవైపు నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
గావస్కర్‌కు నితీశ్ తండ్రి పాదాభివందనం
బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నితీశ్ తల్లిదండ్రులు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ.. ‘ముత్యాలరెడ్డి త్యాగాల వల్ల భారత్‌కు వజ్రంలాంటి ఆటగాడు దొరికాడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవన్నీ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి. భారత్‌కు డైమండ్ దొరికింది’ అని అన్నారు.