అతాను దాస్ రికార్డ్..నాలుగు సార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌పై సూపర్ విక్టరీ
Tokyo olympic games: టోక్యో ఒలింపిక్స్‌లో మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.;
Tokyo olympic games: టోక్యో ఒలింపిక్స్‌లో మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో అతానుదాస్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో వరల్డ్ మూడో ర్యాంకర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హోతో తలపడిన దాస్.. విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఇక అంతక ముందు చైనీస్ థైపాయ్‌కి చెందిన డెంగ్ యూ చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనుదాస్ 6-4 తేడాతో సొంతం సొంతం చేసుకున్నారు. ఆఖరి షాట్‌వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దాస్ విజయం అందుకున్నాడు.
జిన్-హయెక్.. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్.. అర్చరీలో 4 సార్లు అతను స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌కు చుక్కలు చూపాడు. 6-5 పాయింట్ల తేడాతో ముందడుగు వేశాడు. ఈ ఉదయం పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో తన ప్రత్యర్థి చైనీస్ తైపే అర్చర్ డెంగ్ యు-ఛెంగ్‌ను 6-4 తేడాతో ఓడించాడు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, హాకీ ఇండియా.. సాధించిన విజయాల పరంపరను భారత అర్చర్ అతాను దాస్ కొనసాగించాడు.