ఇంగ్లండ్‌పై భారత్ విజయం.. తన భార్యకు స్వీట్ గిప్ట్ ఇచ్చిన జడేజా
ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌పై తలపడిన మూడవ టెస్ట్‌లో భారీ విజయం సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు.;
ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌పై తలపడిన మూడవ టెస్ట్‌లో భారీ విజయం సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. భారతదేశపు స్టార్ పెర్ఫార్మర్ జడేజా ఆ అవార్డును అతని భార్య రివాబాకు అంకితం చేశాడు.
లోకల్ హీరో జడేజా సెంచరీ చేయడంతో పాటు, ఐదు వికెట్లు తీసి రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై 434 పరుగుల తేడాతో భారత్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. హైదరాబాద్‌లో జరిగిన సిరీస్‌లో తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది, అయితే విశాఖపట్నం, రాజ్‌కోట్‌లలో వరుస విజయాలను సొంతం చేసుకుంది.
"ఇది నా హోమ్ గ్రౌండ్‌లో ప్రత్యేకమైన 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' (అవార్డ్). ఈ అవార్డును నా భార్యకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె తెరవెనుక కష్టపడి పనిచేస్తోంది.. ఆమె ఎప్పుడూ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది" అని జడేజా అన్నాడు.
రాజ్‌కోట్‌లో టెస్ట్‌కు కొన్ని రోజుల ముందు, జడేజా కుటుంబంలో చీలికను సృష్టించాడని అతడి తండ్రి ఆరోపించాడు. అతని కొడుకు ఆమెను వివాహం చేసుకున్నప్పటి నుండి సరిగా లేడని క్రికెటర్ తండ్రి అనిరుధ్‌సింగ్ ఆరోపించిన నేపధ్యంలో జడేజా తన భార్యకు రక్షణగా నిలిచాడు.
రాజ్‌కోట్‌లో విజయం గురించి మాట్లాడుతూ, జడేజా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 33/3 వద్ద భారతదేశం అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరూ సెంచరీలు సాధించి జట్టును ఇబ్బందుల నుండి తప్పించారు.
జడేజా 112 పరుగులతో ముగించగా, రోహిత్ 131 పరుగులు చేశాడు. గెలవడానికి 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ జడేజా బౌలింగ్ నైపుణ్యానికి లొంగిపోయింది, ఇది ఎడమచేతి వాటం స్పిన్నర్‌కు 5/41 గణాంకాలను అందించింది. సందర్శకులు కేవలం 122 పరుగులకే ఆలౌటయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఓ ప్రత్యేక అనుభూతి.. అని జడేజా వీడియోలో పేర్కొన్నాడు.