IPL: గుజరాత్‌కు లక్ 'నో'

గుజరాత్‌ టైటాన్స్‌కు లక్నో షాక్.. 33 పరుగుల తేడాతో గుజరాత్‌ చిత్తు;

Update: 2025-05-23 01:30 GMT

ఐపీఎల్‌ 2025లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్‌ జెయింట్స్.. పాయింట్ల పట్టి కలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్ ఇచ్చింది. టైటాన్స్‌ను వారి సొంతగడ్డ పైనే 33 పరుగుల తేడాతో లక్నో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో కేవలం రెండే వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

మిచెల్, పూరన్ ఊచకోత

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్‌ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. నికోలస్ పూరన్ (56*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. **టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 235 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లుతో 117 పరుగులు సాధించాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సెంచరీతో చెలరేగిపోయాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లులో 117 పరుగులు సాధించాడు. ఇక ఓపేనర్లుగా బరిలోకి దిగన మార్క్‌రమ్, మిచెల్ మార్ష్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. పవర్‌ప్లేలో దూకుడుగా రాణించిన వీరిద్దరూ భాగస్వాయ్యంలో 91 పరుగుల సాధించారు. ఈ క్రమంలో గుజరాత్‌ బౌలర్ సాయి కిశోర్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చిన మార్క్‌ర మ్ 24 బంతుల్లో 36 పరుగులు సాధించింది వెనుతిరిగాడు. కోలస్‌ పురాన్‌తో కలిసి రాణించిన మార్ష్ కేవలం 64 బంతుల్లో నే 10 ఫోర్లు , 8 సిక్సర్లతో 117 పరుగులు సాధించి. తన ఖాతాలో మరో సెంచరీని వేసుకున్నాడు. ఇక 19వ ఓవర్లో , అర్షద్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా షెర్ఫాన్ రూథర్‌ఫో ర్డ్‌కు ఆ బంతిని క్యాట్‌ పట్టి మార్ష్‌ను ఔట్‌ చేశాడు. దీంతో విచేట్‌ మార్ష్ వెనుతిరిగాడు.

చాలా దూరంలో...

ఈ సీజన్‌లో గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తు న్న టాప్-3 బ్యాటర్లు సాయి సుదర్శన్ (21; 16 బంతుల్లో 4 ఫోర్లు ), శుభ్‌మన్ గిల్ (35; 20 బంతుల్లో 7 ఫోర్లు ), జోస్ బట్లర్ (33; 18 బంతుల్లో 3 ఫోర్లు , 2 సిక్స్‌లు ) ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయలేకపోయారు. రూథర్‌ఫో ర్డ్ (38; 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు ), షారుక్ ఖాన్ (57; 29 బంతుల్లో 5 ఫోర్లు , 3 సిక్స్‌లు ) పోరాడినా జట్టు ను గెలిపించలేకపోయారు. రాహుల్ తెవాతియా (2) నిరాశపర్చాడు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ 3, ఆయుష్ బదోని 2, అవేశ్ ఖాన్ 2, ఆకాశ్‌ మహరాజ్, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టా రు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లు నష్ట పోయి 202 పరుగులు చేసింది. దీంతో లక్నో చేతిలో ఓడిపోవలసి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టి కలో... మొదటి స్థా నంలోనే గుజరాత్ టైటాన్స్ ఉంది.

అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు

IPL-2025లో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి సెంచరీ చేసి అరుదైన రికార్డు ను సాధించాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు , 8 సిక్సులు బాదిన మార్ష్ 117 పరుగులు చేశాడు. కాగా, 2008 ఐపీఎల్‌లో మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో సెంచరీలు చేసిన ఏకైక సోదర ద్వయంగా వీరు నిలిచారు.

Tags:    

Similar News