IPL: ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్ కలకలం

ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఐసీసీ వార్నింగ్ నోటీసులు;

Update: 2025-04-17 02:30 GMT

ఐపీఎల్ 2025 మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్​ను ఎంజాయ్​ చేసేవారు ఉన్నట్లే, లీగ్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుంది. అప్పుడప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ సంచలన వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఫిక్సింగ్​కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బయటపడింది. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ ఐపీఎల్​లోని 10 ఫ్రాంచైజీలకు వార్నింగ్​ నోటీసులు ఇచ్చింది.

హైదరాబాదీ పనే

బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం ఇప్పటికే లీగ్‌లోని 10 జట్లను హెచ్చరించింది. ఎవరైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని హెచ్చరించింది. ప్రస్తుతం టోర్నమెంట్‌పై అవినీతి మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికోసం ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, జట్టు యజమానులు, వ్యాఖ్యాతల కుటుంబాలకు అభిమానులుగా నటిస్తూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీసీఐ హెచ్చరించింది.

సూత్రధారి ఎవరు?

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త టోర్నమెంట్‌లో పాల్గొనే వారితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ACSU విశ్వసిస్తోంది. అయితే, ఇది ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఈ వ్యాపారవేత్తకు బుకీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. హైదరాబాదీ బిజినెస్ మెన్ గతంలో కూడా ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని టాక్ వినిపిస్తోంది. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ యజమానులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.


Tags:    

Similar News