IPL: పంజాబ్‌కి ‘ఢిల్లీ’ పంచ్‌

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం... సమీర్‌ రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్;

Update: 2025-05-25 02:00 GMT

టాప్‌-2లో నిలిచేందుకు పోటీపడుతున్న జట్లకు వరుసగా మూడో రోజూ ప్రతికూల ఫలితమే ఎదురైంది. గుజరాత్‌, బెంగళూరు తరహాలోనే తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు పంచ్‌ పడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అదరగొట్టింది. అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్‌పై శనివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. జైపూర్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సమీర్ రిజ్వి(58*) హాఫ్ సెంచరీతో రాణించగా.. కరుణ్ నాయర్(44), కేఎల్ రాహుల్ (35), స్టబ్స్(18*) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, మార్కో జాన్సెన్, ప్రవీణ్ దుబే తలో వికెట్ తీశారు.

రాణించిన అయ్యర్, శ్రేయస్స్‌

మొదట శ్రేయస్‌ అయ్యర్‌ (53; 34 బంతుల్లో 5×4, 2×6), మార్కస్‌ స్టాయినిస్‌ (44 నాటౌట్‌; 16 బంతుల్లో 3×4, 4×6) మెరుపులతో పంజాబ్‌ 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (3/33), విప్రాజ్‌ నిగమ్‌ (2/38), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/39) రాణించారు. అనంతరం సమీర్‌ రిజ్వి (58 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 5×6) అనూహ్యంగా చెలరేగిపోవడంతో డీసీ.. 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కరుణ్‌ నాయర్‌ (44; 27 బంతుల్లో 5×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (35; 21 బంతుల్లో 6×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/41) ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది నాలుగో ఓటమి కాగా.. 14 మ్యాచ్‌ల్లో దిల్లీ ఏడో విజయం నమోదు చేసింది. పంజాబ్‌ 200 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించినా వెరవని దిల్లీ.. అదిరే విజయంతో సీజన్‌ను ముగించింది. సమీర్‌ రిజ్వి సంచలన ఇన్నింగ్స్‌తో డీసీకి అద్భుత విజయాన్నందించాడు.

Tags:    

Similar News