INDIA WIN: ఇషాన్ ఊచకోత.. భారత్ విజయం

4-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

Update: 2026-02-01 03:30 GMT

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన భారత్, 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 4-1తో ముగించింది. వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే శతకం సాధించిన ఇషాన్, మైదానమంతా సిక్సర్లతో దద్దరిల్లేలా చేశాడు. బౌలర్లు ఎవరైన్నది చూడకుండా ఇషాన్ ఊచకోత కోశాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ఇషాన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇషాన్‌కు తోడుగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన క్లాస్ చూపించాడు.న. టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

పరుగుల వరద

’ ఇషాన్‌ కిషన్‌ (103; 43 బంతుల్లో 6×4, 10×6) విధ్వంసక శతకానికి.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (63; 30 బంతుల్లో 4×4, 6×6), హార్దిక్‌ పాండ్య (42; 17 బంతుల్లో 1×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌లు తోడవడంతో భారత్‌ 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో కివీస్‌ కూడా దీటుగానే స్పందించినప్పటికీ.. లక్ష్యం అసాధ్యమైంది కావడంతో ఓటమి తప్పలేదు. ఆ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ (80; 38 బంతుల్లో 8×4, 6×6) చెలరేగాడు. అర్ష్‌దీప్‌ 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ భారీగా పరుగులిచ్చేయగా.. బౌలర్లకు కాళరాత్రిలా మారిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ (3/33) అదరగొట్టాడు. సూర్య ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 18వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వికెట్ పడిపోయింది. 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు, అందులో 10 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా తరఫున రింకు సింగ్ 8, శివం దుబే 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

కివీస్ పోరాడినా..

కివీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు. టిమ్ సీఫెర్ట్‌ వికెట్ కోల్పోయాడు. తొలి వికెట్ త్వరగా కోల్పోయిన తర్వాత, ఫిన్ అలెన్ న్యూజిలాండ్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇది భారత్‌పై తొలి అర్ధ సెంచరీ. అక్షర్ పటేల్ 38 బంతుల్లో 80 పరుగులకు ఫిన్ అలెన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ ఏడు పరుగులు మాత్రమే చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ అదే ఓవర్‌లో రాచిన్ రవీంద్ర (30), మిచెల్ సాంట్నర్ (0)లను అవుట్ చేయడంతో కివీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

Tags:    

Similar News