భారత బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్‌కు ఈ స్పీడ్‌గన్‌ను డిప్యూటీగా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా, ఈ రేసులో శ్రేయస్ అయ్యర్, పంత్, హర్దిక్, సూర్యకుమార్ ఉన్నా జట్టు భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో బుమ్రాకే మొగ్గుచూపినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో 20న ఆడనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రాగా.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యాడు. శుభ్‌మన్ గిల్‌ను పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా అప్పట్లో చెప్పారు. మరికొన్ని ఐసీసీ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతాడని కూడా స్పష్టం చేశారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.