టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్ట్ చూపారు. పురుషుల జట్టు కోసం బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు కెవిన్ రిప్లై ఇచ్చారు. నేను అందుబాటులో ఉన్నా అంటూ ఆయన సమాధానమిచ్చారు. కెవిన్ తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 8181 రన్స్, 136 వన్డేల్లో 4440, 37 టీ20ల్లో 1176 రన్స్ చేశారు.
దేశవాళీ క్రికెట్ దిగ్గజాల్లోని ఒకరిని బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తుండగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పనిచేస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్, అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటేలు ఉన్నారు.
గౌతమ్ గంభీర్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తర్వాత, టీమిండియా చరిత్రలో పలు ఘోర పరాజయాలను చవిచూసింది. గౌతమ్ గంభీర్ తక్కువ వ్యవధిలోనే టీమ్ ఇండియాకు ఎన్నో అవమానకరమైన రికార్డులను అందించాడు. దీంతో అతన్ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉంటే ఇంకెన్ని దారుణ ఓటములు చూడాలో అని క్రికెట్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇదే సమయంలో బీసీసీఐ సైతం గౌతమ్ గంభీర్‌పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.