KING KOHLI: గంభీర్ గుర్తుపెట్టుకో..ఆడి పేరు కోహ్లీ

వరుస శతకాలతో దంచేస్తున్న కోహ్లీ... ప్రపంచకప్ లో చోటు దిశగా పయనం... సంబరాలు చేసుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్

Update: 2025-12-05 06:30 GMT

వి­రా­ట్ కో­హ్లీ బ్యా­ట్ నుం­చి వచ్చిన అద్భు­త­మైన 53వ వన్డే సెం­చ­రీ.. టీ­మిం­డి­యా­కు రెం­డో వన్డే­లో వి­జ­యా­న్ని అం­దిం­చ­లే­క­పో­యిం­ది. అయి­తే­నేం, ఈ ఇన్నిం­గ్స్‌­కు మాజీ క్రి­కె­ట­ర్లు, అభి­మా­నుల నుం­చి మా­త్రం వి­ప­రీ­త­మైన ప్ర­శం­స­లు దక్కా­యి. స్టా­ర్ బ్యా­ట­ర్ వి­రా­ట్ కో­హ్లీ వరు­స­గా రెం­డో వన్డే­లో­నూ సెం­చ­రీ బా­ద­డం­తో భారత క్రి­కె­ట్ వర్గా­ల్లో ఆనం­దం ఉప్పొం­గిం­ది. రా­య్‌­పూ­ర్‌­లో సౌత్ ఆఫ్రి­కా­తో జరి­గిన మ్యా­చ్‌­లో కో­హ్లీ తన కె­రీ­ర్‌­లో 53వ వన్డే శత­కా­న్ని పూ­ర్తి చే­శా­డు. రాం­చీ­లో సా­ధిం­చిన 135 పరు­గుల భారీ ఇన్నిం­గ్స్‌ తర్వాత, 35 ఏళ్ల కో­హ్లీ ఈ మ్యా­చ్‌­లో­నూ 93 బం­తు­ల్లో 102 పరు­గు­లు చే­శా­డు. తన­దైన కచ్చి­త­త్వం, దూ­కు­డు­తో కూ­డిన బ్యా­లె­న్స్, వి­కె­ట్ల మధ్య వే­గ­వం­త­మైన పరు­గు­ల­తో భా­ర­త్ భారీ స్కో­రు­కు పు­నా­ది వే­శా­డు.

కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం

ఈ ఆధు­నిక ది­గ్గ­జం కో­హ్లీ నుం­చి వచ్చిన మరో మా­స్ట­ర్ క్లా­స్ ఇన్నిం­గ్స్‌­ను మాజీ క్రి­కె­ట­ర్లు, కా­మెం­టే­ట­ర్లు, సహచర ఆట­గా­ళ్లు సో­ష­ల్ మీ­డి­యా­లో తెగ మె­చ్చు­కు­న్నా­రు. అభి­నం­ద­నల వె­ల్లు­వ­లో మాజీ భారత బ్యా­ట­ర్ మొ­హ­మ్మ­ద్ కైఫ్ చే­సిన వ్యా­ఖ్య­లు ప్ర­త్యే­కం­గా ని­లి­చా­యి. కో­హ్లీ ఇన్నిం­గ్స్‌­ను 'ప్యూ­ర్ విం­టే­జ్' అని పే­ర్కొం­టూ, కైఫ్ 'ఎ­క్స్'­లో ఒక సం­చ­లన ప్ర­క­టన చే­శా­రు. "కో­హ్లీ లేని క్రి­కె­ట్ అంటే శూ­న్యం… ప్యూ­ర్ విం­టే­జ్!" అని రా­సు­కొ­చ్చా­రు. కో­హ్లీ­కు­న్న అపా­ర­మైన ఆక­ర్ష­ణ­కు, అతని సెం­చ­రీ­ల­ను అభి­మా­ను­లు, మాజీ ఆట­గా­ళ్లు ఎంత ము­ఖ్యం­గా చూ­స్తా­రో చె­ప్ప­డా­ని­కి ఈ వ్యా­ఖ్య అద్దం పడు­తోం­ది. "వి­రా­ట్ కో­హ్లీ­కి వంద అంటే వేరే మత్తు ఉం­టుం­ది... కిం­గ్‌­కు బ్యా­క్-టు-బ్యా­క్ సెం­చ­రీ­లు. 53వ వన్డే సెం­చ­రీ. వి­రా­ట్ ఉన్నా­డు అంటే ఏదై­నా సా­ధ్య­మే ,” అని పో­స్ట్ చే­శా­రు.

నంబర్ 3లో అత్యధిక సెంచరీలు

వి­రా­ట్ కో­హ్లీ తన ODI కె­రీ­ర్‌­లో ఎక్కువ భాగం నం­బ­ర్ 3 స్థా­నం­లో బ్యా­టిం­గ్ చే­శా­డు. అతను ఇప్పు­డు ODI క్రి­కె­ట్‌­లో నం­బ­ర్ 3 స్థా­నం­లో బ్యా­టిం­గ్ చే­స్తూ 46 సెం­చ­రీ­లు సా­ధిం­చా­డు, ఇది ప్ర­పంచ రి­కా­ర్డు. ఇం­త­కు­ముం­దు నం­బ­ర్ 3 స్థా­నం­లో బ్యా­టిం­గ్ చే­స్తూ అత్య­ధిక సెం­చ­రీ­లు సా­ధిం­చిన రి­కా­ర్డు భా­ర­త్‌­కు చెం­దిన సచి­న్ టెం­డూ­ల్క­ర్ పే­రిట ఉంది. టెం­డూ­ల్క­ర్ మూడో స్థా­నం­లో బ్యా­టిం­గ్ చే­స్తూ 45 ODI సెం­చ­రీ­లు సా­ధిం­చా­డు. 2027 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­లో వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శర్మ­ల­ను ఆడిం­చ­కూ­డ­ద­ని భారత ప్ర­ధాన కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్, చీఫ్ సె­లె­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్ అను­కుం­టు­న్నా­ర­ని వా­ర్త­లు వస్తు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. కానీ వి­రా­ట్, రో­హి­త్ బ్యా­టిం­గ్ తీరు చూ­స్తే.. వా­రి­ని జట్టు నుం­చి పక్కన పె­ట్ట­డం కష్టం మా­త్ర­మే కాదు, అసా­ధ్యం కూడా. 2027 ప్ర­పం­చ­క­ప్‌ సమ­యా­ని­కి రో-కో­ల­కు దా­దా­పు 39 ఏళ్లు ఉం­టా­యి. అం­దు­కే వారి భవి­ష్య­త్తు గు­రిం­చి ని­రం­త­రం చర్చ జరు­గు­తోం­ది. కానీ ఇద్ద­రూ హాఫ్ సెం­చ­రీ­ఎం సెం­చ­రీ­ల­తో చె­ల­రే­గు­తూ.. జట్టు­కు తాము ఎంత ము­ఖ్య­మో ని­రూ­పి­స్తు­న్నా­రు. టీ20, టె­స్ట్ నుం­చి రి­టై­ర్ అయ్యా­రు. వి­రా­ట్‌­తో పాటు రో­హి­త్ కూడా గత మూడు మ్యా­చ్‌­ల్లో సెం­చ­రీ, హాఫ్ సెం­చ­రీ­తో అద్భు­త­మైన ఫా­మ్‌­ను ప్ర­ద­ర్శిం­చా­డు. ఆధు­నిక యు­గం­లో కో­హ్లీ అత్యు­త్తమ వన్డే బ్యా­ట్స్‌­మ­న్. రాం­చీ­లో 120 బం­తు­ల్లో 11 ఫో­ర్లు, ఏడు సి­క్స­ర్ల­తో 135 పరు­గు­లు చే­శా­డు.

Tags:    

Similar News