T20 WORLD CUP: గణాంకాలాన్నీ మన వైపే..కానీ ఇదీ సెమీస్

సెమీఫైనల్ రద్దు అయితే సెమీస్ కు ఆ జట్టే

Update: 2026-03-05 06:15 GMT

టీ20 వరల్డ్‌కప్‌ 2026 టోర్నీ కీలక దశకు చేరుకున్న వేళ క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఒకే మ్యాచ్‌పై నిలిచింది. ముంబయిలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా నేడు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు సెమీఫైనల్‌–2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా ఈ కీలక పోరులో విజయం సాధించి మరోసారి ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ కూడా బలమైన జట్టుగా నిలుస్తుండటంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.

టీ20 ఫా­ర్మా­ట్‌­లో భా­ర­త్‌, ఇం­గ్లాం­డ్‌ మధ్య పోటీ ఎప్పు­డూ ఆస­క్తి­క­రం­గా­నే ఉం­టుం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఈ రెం­డు జట్లు మొ­త్తం 29 సా­ర్లు ము­ఖా­ము­ఖి తల­ప­డ్డా­యి. ఇం­దు­లో భా­ర­త్‌ 17 మ్యా­చ్‌­ల్లో వి­జ­యం సా­ధిం­చ­గా, ఇం­గ్లాం­డ్‌ 12 మ్యా­చ్‌­ల్లో గె­లి­చిం­ది. ఈ గణాం­కా­లు చూ­స్తే భా­ర­త్‌­కు కొంత పై­చే­యి ఉన్న­ట్లు కని­పిం­చి­నా, ఇం­గ్లాం­డ్‌ కూడా పో­టీ­గా ని­లి­చి­న­ట్లు స్ప­ష్ట­మ­వు­తోం­ది. ము­ఖ్యం­గా ఇం­గ్లాం­డ్‌ జట్టు టీ20ల్లో దూ­కు­డైన ఆట­తీ­రు­తో ప్ర­త్య­ర్థు­ల­కు గట్టి సవా­లు వి­సు­రు­తుం­ది. స్వ­దే­శం­లో జరి­గిన మ్యా­చ్‌­ల­ను పరి­శీ­లి­స్తే భా­ర­త్‌­కు మరింత బల­మైన రి­కా­ర్డు ఉంది. భా­ర­త్‌­లో జరి­గిన టీ20 మ్యా­చ్‌­ల్లో టీ­మ్ఇం­డి­యా 10 సా­ర్లు వి­జ­యం సా­ధిం­చ­గా, ఇం­గ్లాం­డ్‌ 6 సా­ర్లు మా­త్ర­మే గె­లి­చిం­ది. మరో­వై­పు ఇం­గ్లాం­డ్‌ గడ్డ­పై జరి­గిన మ్యా­చ్‌­ల్లో భా­ర­త్‌ నా­లు­గు వి­జ­యా­లు సా­ధిం­చ­గా, ఇం­గ్లాం­డ్‌ ఐదు సా­ర్లు గె­లి­చిం­ది. తట­స్థ వే­ది­క­ల్లో కూడా భా­ర­త్‌ కొంత ఆధి­క్యా­న్ని ప్ర­ద­ర్శిం­చిం­ది. ఇలాం­టి గణాం­కా­లు ఈ రెం­డు జట్ల మధ్య పోటీ ఎంత సమ­తూ­కం­గా ఉందో చూ­పి­స్తు­న్నా­యి. టీ20 వర­ల్డ్‌­క­ప్‌ చరి­త్ర­లో కూడా భా­ర­త్‌, ఇం­గ్లాం­డ్‌ మధ్య ఆస­క్తి­క­ర­మైన పోటీ కొ­న­సా­గు­తోం­ది.

సెమీఫైనల్ రద్దు అయితే

టీ20 వర­ల్డ్ కప్ 2026 టో­ర్నీ­లో భా­గం­గా నేడు ముం­బై­లో­ని వాం­ఖ­డే స్టే­డి­యం­లో ఇం­డి­యా - ఇం­గ్లాం­డ్ మధ్య సెమీ ఫై­న­ల్ మ్యా­చ్ జర­గ­నుం­ది. టీ20 వర­ల్డ్ కప్ 2026 టో­ర్నీ సెమీ ఫై­న­ల్ మ్యా­చు­ల­కు రి­జ­ర్వు డే­ల­ను అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చిం­ది ఐసీ­సీ.బతైం ఇం­డి­యా - ఇం­గ్లాం­డ్ మ్యా­చ్‌­కి మా­ర్చి 6న రి­జ­ర్వు డేగా ఉం­టుం­ది. మ్యా­చ్ రోజు ఆట ప్రా­రం­భ­మై, వర్షం లేదా మరే కా­ర­ణం­గా అయి­నా అం­త­రా­యం ఏర్ప­డి­తే.. ఎక్క­డై­తే ఆట ఆగిం­దో అక్క­డి నుం­చి రి­జ­ర్వు డే రోజు మ్యా­చ్ తి­రి­గి ని­ర్వ­హిం­చ­బ­డు­తుం­ది. ఒక­వేళ మా­ర్చి 5న భారత జట్టు బ్యా­టిం­గ్ చే­స్తూ6.2 ఓవ­ర్ల­లో 58/2 స్కో­రు­తో ఉంటే.. రి­జ­ర్వు డే రో­జున 6.3 ఓవ­ర్ల నుం­చే మ్యా­చ్ మొ­ద­ల­వు­తుం­ది. గ్రూ­ప్ స్టే­జీ­లో చెరో ఐదు ఓవ­ర్ల పాటు మ్యా­చ్ సా­గి­నా రి­జ­ల్ట్‌­ని డి­సై­డ్ చే­స్తా­రు.

అయి­తే సెమీ ఫై­న­ల్ మ్యా­చు­ల్లో మా­త్రం డక్ వర్త్ లూ­యి­స్ పద్ధ­తి ప్ర­కా­రం మ్యా­చ్ రి­జ­ల్ట్ తే­ల్చా­లం­టే కనీ­సం చెరో 10 ఓవ­ర్లు మ్యా­చ్ ఆడా­ల్సి ఉం­టుం­ది. 9.5 ఓవ­ర్ల­కు మ్యా­చ్ ఆగి­నా రి­జ­ర్వు డేకి వె­ళ్లక తప్ప­దు. సెమీ ఫై­న­ల్స్‌­కి ని­ర్ణీత సమయం కంటే మరో గం­ట­న్నర అద­నం­గా సమయం కే­టా­యిం­చిం­ది ఐసీ­సీ. ఉదా­హ­ర­ణ­కు సా­ధా­ర­ణం­గా 7 గం­ట­ల­కు మొ­ద­ల­య్యే మ్యా­చ్, వర్షం కా­ర­ణం­గా ఆల­స్య­మై­తే రా­త్రి 9:30 వరకూ చూసి.. ఆ రోజు ఆటను రద్దు చే­స్తా­రు. అయి­తే సెమీ ఫై­న­ల్స్‌­లో మరో గం­ట­న్నర రా­త్రి 11 గంటల వరకూ వేచి చూ­సిన తర్వా­తే ఆటను రద్దు చే­యా­ల్సి ఉం­టుం­ది. దీం­తో మ్యా­చ్ పూ­ర్తి చే­సేం­దు­కు మరో 2 గం­ట­లు అద­నం­గా ఉం­టుం­ది. ఒక­వేళ వరు­స­గా రెం­డు రో­జు­లు వర్షం కు­రి­స్తే మా­త్రం టీ­మిం­డి­యా­కి పె­ద్ద దె­బ్బే. సూ­ప­ర్ 8 రౌం­డ్‌­లో టే­బు­ల్ టా­ప­ర్‌­గా ని­లి­చిన కా­ర­ణం­గా సెమీ ఫై­న­ల్ మ్యా­చ్ రద్దు అయి­తే.. ఇం­గ్లాం­డ్ ఫై­న­ల్‌­కి అర్హత సా­ధి­స్తుం­ది. సూ­ప­ర్ 8 రౌం­డ్‌­లో సౌ­తా­ఫ్రి­కా­తో మ్యా­చ్ ఓడిన భారత జట్టు, టో­ర్నీ నుం­చి ని­ష్క­మిం­చా­ల్సి ఉం­టుం­ది.

Tags:    

Similar News