England Premier League: మేసన్‌ను కొనుగోలు చేసిన మాంచెస్టర్ యునైటెడ్

55 మిలియన్ యూరోలు, షరతులతో 5 మిలియన్ యూరోలు చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఇరుజట్ల మధ్య సయోధ్య;

Update: 2023-06-30 09:58 GMT

ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ జట్టు చెల్సీ స్టార్ మిడ్ ఫీల్డర్ మేసన్ మౌంట్ మాంచెస్టర్‌ యునైటైడ్ జట్టుకు ట్రాన్స్‌ఫర్ అవడానికి ఇరుజట్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్నో రోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఈరోజుతో తెరపడింది. మాంచెస్టర్ యునైటైడ్‌ జట్టు 55 మిలియన్ యూరోలు, షరతులతో మరో 5 మిలియన్ యూరోలు చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఇరుజట్ల మధ్య ఈ డీల్ కుదిరింది.

గత సమ్మర్ విండో మొత్తం చెల్సీ, మాంచెస్టర్ జట్లు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఇంతకు ముందు 55 మిలియన్ యూరోలు చెల్లించాలన్న ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తాజాగా 5 మిలియన్ యూరోల బోనస్‌లకు ఒప్పందం కుదిరింది. చెల్సీతో మేసర్ కాంట్రాక్ట్ వచ్చే సంవత్సరం ముగియనుంది. నూతన కాంట్రాక్ట్ ప్రకారం జట్టుతో 5 సంవత్సరాలకు ఈ డీల్ కుదిరింది. మరో 4 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా డీల్‌లో భాగంగా పొందుపర్చారు.

Mason Mount

ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఈ 24 యేళ్ల మేసన్ మౌంట్ చెల్సీ మిడ్‌ ఫీల్డ్‌లో కీలక ఆటగాడిగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరపున 36 మ్యాచుల్లో ఆడి గెలిచాడు. ఇటలీతో జరిగిన 2020 యూరో ఫైనల్‌లో జట్టు సభ్యుడిగా ఉన్నాడు. చెల్సీ తరపున 2021 ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ లీగ్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

చెల్సీ తరఫున 129  మ్యాచ్‌లు ఆడిన మేసన్ 27 గోల్స్ చేశాడు. మరో 22 (Assists) గోల్స్‌లో సహాయపడ్డాడు. అయితే గత చివరి సీజన్‌లో గాయం కారణంగా 3 గోల్స్‌ మాత్రమే చేశాడు.

టెన్ హ్యాగ్స్ కోచ్‌ వహిస్తున్న చెల్సీ జట్టు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవలనే ప్రణాళికలో భాగంగా ఈ డీల్ కుదిరింది. ఇప్పటికే జట్టులోని గోల్‌కీపర్ మెండీ, డిఫెండర్ కౌలిబాలిలను సౌదీ ప్రో లీగ్ జట్లకు విక్రయించగా, స్టార్ మిడ్ ఫీల్డర్ కొవాచిచ్ మాంచెస్టర్ సిటీలో చేరాడు.


Similar News