ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాతో ఆదివారం జరిగే మ్యాచుకు ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ ఫఖర్ జమాన్ దూరమైనట్లు పీసీబీ పేర్కొంది. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచులో గాయం కారణంగా మధ్యలోనే ఫీల్డ్ వీడగా ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపింది. దీంతో అతడు దుబాయ్ వెళ్లట్లేదని వెల్లడించింది. ఫఖర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను తీసుకుంటారని సమాచారం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫఖర్ జమాన్ భారత్‌పై సెంచరీ చేశాడు. ఆ రోజు ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన ఫఖర్ 106 బంతుల్లో 3 సిక్సర్లు, 12 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఈ సెంచరీ సహాయంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమిండియాపై సంచలనం సృష్టించిన బ్యాటర్ ఇప్పుడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ అవుతుంది.