ipl: ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా..!

ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందంటూ వదంతులు... చివరి మ్యాచ్ ఆడేశాడంటున్న మాజీలు;

Update: 2025-05-02 05:45 GMT

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై కొన్ని సీజన్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. వయసు మీద పడుతున్నా, మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నా ఎల్లో ఆర్మీ కోసం ధోనీ ఇంకా ఆడుతూ వస్తున్నాడు. ధోనీ కీపింగ్ లో అదరగొడుతున్నా రిటైర్మెంట్ పుకార్లు ఆగడం లేదు. బ్యాటింగ్‌లోనూ ధోనీ బాగానే రాణిస్తున్నాడు. అయితే పంజాబ్ తో మ్యాచ్ వేళ... ధోనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టాస్ వేసే వేళ తర్వాతి మ్యాచ్‌లో తాను ఆడకపోవచ్చునంటూ ధోనీ బాంబు పేల్చాడు. టాస్ ఓడిన ధోని మాట్లాడేందుకు రాగానే చెపాక్ స్టేడియం దద్దరిల్లింది. సీఎస్‌కే అభిమానులు ధోని.. ధోని.. అంటూ గట్టిగా అరిచారు. ఈ అభిమానుల రచ్చ ఓ వైపు మార్మోగుతుండగానే.. కామెంటేటర్ నుంచి మాహీకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నెక్స్ట్ ఇయర్ కూడా చెపాక్‌కు కచ్చితంగా వచ్చి ఆడతావు కదా అని ధోనీకి క్వశ్చన్ ఎదురైంది. దీనికి అతడు తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కాదు.. నెక్స్ట్ మ్యాచ్‌కు వస్తానో.. లేదో కూడా తెలియదంటూ ధోనీ కామెంట్ చేశాడు. దీంతో ధోనీకి ఇదే చివరి మ్యాచా అంటూ సోషల్ మీడియాలో చర్చలు ఆరంభమైపోయాయి. ధోనీ పక్కా నెక్స్ట్ ఇయర్ ఆడతాడని నెటిజన్స్ అంటున్నారు.

 ధోనీ ఆడకపోతేనే మంచిది

ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం తర్వాత ఎంఎస్ ధోని ఇప్పుడు చెన్నై జట్టుకు‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ వరుసగా విఫలమవుతుండడంపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌ క్రిస్ట్ స్పందించాడు. వచ్చే సీజన్‌లో మహీ ఐపీఎల్‌లో ఉండకూడదని ఆయన చెప్పాడు. " ధోని గొప్ప ఆటగాడు. అతను ఇకపై ఆటలో ఇంకా ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ధోని సాధించగలగేదంతా సాధించాడు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకే తెలుసు. ధోని బహుశా వచ్చే ఏడాది అక్కడ ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. నాకు ధోని అంటే చాలా ఇష్టం.. ధోని ఒక ఛాంఫియన్, గొప్ప ఆటగాడు." అని అన్నాడు.

Tags:    

Similar News