Muttiah Muralitharan : టెస్టుల్లో నా రికార్డును బ్రేక్ చేయలేరు : ముత్తయ్య మురళీధరన్
టెస్టు క్రికెట్ పై శ్రీలంక మాజీ వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ముత్తయ్య తన రికార్డును ఏ బౌలర్ బ్రేక్ చేయలేడని తెలిపాడు. ప్రస్తుత రోజుల్లో క్రికెటర్లు పరిమిత ఓవర్ల మ్యాచ్ లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని.. అందుకే తన రికార్డు సేఫ్ గా ఉంటుందని మురళీధరన్ చెప్పుకొచ్చాడు.‘నేను టెస్ట్ క్రికెట్ గురించి ఆందోళన చెందుతున్నా. ప్రతి దేశం ఏడాదిలో ఆరు లేదా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్‌కు ఆదరణ ఉండొచ్చు. కానీ, కొన్ని ఇతర దేశాల్లో చాలామంది ప్రజలు టెస్ట్ క్రికెట్ చూడట్లేదు. దాంతో టెస్టు మ్యాచ్‌లు ఆడటం తగ్గిపోతోంది. ఈ ఫార్మాట్‌లో నా 800 వికెట్ల రికార్డును మరొకరు అధిగమించడం కష్టం. ఎందుకంటే ప్రస్తుత క్రికెటర్లు టీ20 మ్యాచ్ ల్లో ఆడేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా కాలంలో ఆటగాళ్లకు 20 ఏళ్ల కెరీర్ ఉండేది. ఇప్పుడు క్రికెటర్ల కెరీర్ తగ్గిపోయింది’అని మురళీధరన్ పేర్కొన్నాడు.