భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ తన రిటైర్మెంట్ గురించి వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించారు. తన భవిష్యత్తుపై తాను మాత్రమే నిర్ణయం తీసుకోగలనని ఆయన స్పష్టం చేశారు."నా రిటైర్మెంట్ ఎప్పుడనేది వారి చేతుల్లో లేదు. క్రికెట్ ఆడటం మానేయాలని నేను అనుకున్నప్పుడు మాత్రమే నేను రిటైర్ అవుతాను, క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ ఆటను నేను ఎంతో ప్రేమించాను. నా శరీరం సహకరించనప్పుడు మాత్రమే నేను క్రికెట్ ఆపాలనుకుంటాను. ఇంగ్లాండ్ టూర్ మరియు ఆసియా కప్‌కు ఎంపిక కాకపోవడంపై షమీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జాతీయ జట్టుకు ఆడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఒకవేళ అంతర్జాతీయ జట్టులోకి ఎంపిక కాకపోతే దేశీయ క్రికెట్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నానని షమీ తెలిపారు.