Neeraj Chopra: కోచ్‌కు నీరజ్ భావోద్వేగ వీడ్కోలు
నోట్ రాసి తన సెండ్ఆఫ్ ఇచ్చిన గోల్డెన్ బాయ్;
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ క్లాస్ బార్టోనీజ్‌కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. అయిదేళ్లుగా నీరజ్‌కు కోచ్‌గా ఉంటోన్న 75 ఏళ్ల బార్టోనీజ్.. వ్యక్తిగత కారణాలతో ఈ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. ‘‘ఎక్కడ ఆరంభించాలో తెలియకుండా ఇది రాస్తున్నా. కోచ్.. మీరు నాకు గురువు కన్నా ఎక్కువ. మీరు నేర్పిందంతా ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడానికి నాకెంతో ఉపయోగపడింది. ప్రతి పోటీకి నేను మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండడం కోసం మీరెంతో శ్రమించారు. నేను గాయంతో ఇబ్బందిపడ్డ రోజుల్లో నాకు అండగా నిలిచారు. ఎత్తుపల్లాలో నాకు తోడుగా ఉన్నారు’’ అని నీరజ్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
‘‘స్టాండ్స్‌లో మీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. కానీ జావెలిన్ విసురుతున్నప్పుడు మీ మాటలు నా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. ఇక మీ ప్రాంక్‌లు, మీ నవ్వులు లేకపోవడం నాకు లోటే. నా ప్రయాణంలో భాగమైనందుకు కృతజ్ఞతలు. మీ ప్రయాణంలో నన్ను భాగం కానిచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని రాసుకున్నాడు. క్లాస్ బార్టోనిట్జ్ 2019 నుండి నీరజ్ చోప్రాకు కోచ్‌గా ఉన్నాడు. బార్టోనీజ్ కోచ్‌గా ఉన్నప్పుడే.. నీరజ్ టోక్యోలో ఒలింపిక్స్ స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌గా, డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు.భావోద్వేగ వీడ్కోలు నోట్