Neeraj Chopra : నీరజ్ చోప్రా నంబర్ అడిగిన లేడీ ఫ్యాన్

Update: 2024-09-18 09:30 GMT

జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. డైమండ్ లీగ్ లోనూ సత్తా చాటిన నీరజ్ కు విదేశాల్లో క్రేజ్ ఉంది. విదేశాలకు చెందిన ఫ్యాన్స్ కూడా అతడి ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక లేడీ ఫ్యాన్.. నీరజ్‌ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకొని, ఫోన్ నంబర్ కూడా అడగడం అందులో కనిపించింది. ఆ వీడియోలో పలువురు విదేశీ యువతులు నీరజ్ తో సెల్ఫీలు దిగారు. ఒక అమ్మాయి మాత్రం.. మీ ఫోన్ నంబర్ ఇస్తారా..? అని అడిగింది. ఆమె రిక్వెస్ట్ ను నీరజ్ సున్నితంగా తిరస్కరించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో మాత్రం స్పష్టత లేదు. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఇటీవల జరిగిన డైమండ్‌ లీగ్ ఫైనల్ సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకొని ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News