భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో ₹50లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. దీంతో అతడి ఆస్తి, సంపాదన ఎంతనే చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం నీరజ్ నికర ఆస్తులు సుమారు ₹37కోట్లు. నెలకు సగటున ₹30 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం అని తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచాక నీరజ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారీగా అందుతున్నాయి.
నీరజ్ చోప్రాకు హెర్నియా కారణంగా గజ్జల్లో గాయమైనట్లు సమాచారం. ఈ గాయం పరిశీలన కోసమే జర్మనీ వెళ్లారు. పేగులు బయటికి పొడుచుకురావడాన్ని హెర్నియాగా వ్యవహరిస్తారు. అవి పొట్ట కింది భాగంపై ఒత్తిడి చేయడంతో అక్కడి నుంచి గజ్జల్లో కండరాలపై ఒత్తిడి పడి గాయం అవుతుంటుంది. చాలాకాలంగా ఉన్న ఈ సమస్య కారణంగానే పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని తెలుస్తోంది.