ఓటమి తర్వాత.. రాకెట్‌ను నేలకేసి కొట్టి.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్ .. !
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.;
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌తో తలపడిన తుదిపోరులో 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. దీంతో ఈ ఏడాది క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించి చరిత్ర సృష్టించాలన్న జకోవిచ్ కలలు చెదిరిపోవడంతో.... తీవ్ర మనస్తాపంతో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. మెద్వెదేవ్‌తో ఓటమిపాలయ్యాక తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కంటతడి పెట్టుకున్నాడు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జకోవిచ్ ఈ ఏడాది తొలుత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లోనూ విజయం సాధిస్తాడని ఆశించినా అది జరగలేదు. దీంతో గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు యూఎస్ ఓపెన్‌లోనైనా గెలుపొంది కనీసం క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. జకోవిచ్ ఇప్పటివరకు అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరిన్న జకోవిచ్‌కి.... ఈ పరాజయంతో మనస్తాపం చెందాడు.