WPL: మహిళల ప్రీమియర్‌ లీగ్‌‌... తొలి మ్యాచులోనే అద్భుతం

ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయం... ముంబై ఇండియన్స్‌కు నిరాశ... అద్భుతం చేసిన నాడిన్‌ డి క్లెర్క్‌.. చివరి 4 బంతుల్లో విధ్వంసం

Update: 2026-01-10 03:00 GMT

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ మొదటి మ్యాచ్‌తోనే అభిమానులకు అసలైన థ్రిల్‌ను అందించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే చివరి బంతి వరకు ఉత్కంఠను నిలబెట్టిన ఈ పోరు, డబ్ల్యూపీఎల్‌ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, మాజీ విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికులను కుర్చీల అంచులపై కూర్చోబెట్టింది. చివరకు ఆల్‌రౌండర్‌ నదైన్‌ డి క్లెర్క్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆరంభంలోనే భారీ స్కోరు సాధించాలనే ఉద్దేశంతో ముంబయి బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్లు వేసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించారు. సంజన ఆకర్షణీయంగా ఆడి 25 బంతుల్లో 45 పరుగులు చేయగా, కేరీ 29 బంతుల్లో 40 పరుగులు, కమలిని 28 బంతుల్లో 32 పరుగులతో జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు.

బోణీ కొట్టిన ఆర్సీబీ

ముం­దు­గా బ్యా­టిం­గ్‌­కు ది­గిన ముం­బై ఇం­డి­య­న్స్‌ 20 ఓవ­ర్ల­లో 6 వి­కె­ట్ల­కు 154 పరు­గు­లు చే­సిం­ది. సంజన (25 బం­తు­ల్లో 7 ఫో­ర్లు, 1 సి­క్స్‌­తో 45), కేరీ (29 బం­తు­ల్లో 4 ఫో­ర్ల­తో 40), కమ­లి­ని (28 బం­తు­ల్లో 5 ఫో­ర్ల­తో 32) రా­ణిం­చా­రు. డి క్లె­ర్క్‌­కు 4 వి­కె­ట్లు లభిం­చా­యి. ఛే­ద­న­లో ఆర్‌­సీ­బీ 20 ఓవ­ర్ల­లో 7 వి­కె­ట్ల­కు 157 పరు­గు­లు చేసి గె­లి­చిం­ది. హ్యా­రి­స్‌ (25), అరుం­ధ­తి (20) సహ­క­రిం­చా­రు. కె­ర్‌, కే­రీ­ల­కు రెం­డే­సి వి­కె­ట్లు దక్కా­యి. ప్లే­య­ర్‌ ఆఫ్‌ ద మ్యా­చ్‌­గా డి క్లె­ర్క్‌ ని­లి­చిం­ది.నదై­న్ డి క్లా­ర్క్ 44 బం­తు­ల్లో 63 పరు­గు­ల­తో నా­టౌ­ట్‌­గా ని­లి­చి చి­వ­రి ఓవ­ర్‌­లో వరు­స­గా భారీ షా­ట్లు కొ­ట్టి మ్యా­చ్‌­ను RCB వైపు తి­ప్పిం­ది. దీం­తో ఆమె­కు మ్యా­న్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డు లభిం­చిం­ది. గ్రే­స్ హా­రి­స్ 25, అరుం­ధ­తి రె­డ్డి 20, స్మృ­తి మం­ధాన 18 పరు­గు­ల­తో రా­ణిం­చా­రు. ముం­బై బౌ­ల­ర్ల­లో అమె­లి­యా కెర్, ని­కో­లా కారీ చెరో రెం­డు వి­కె­ట్లు తీ­శా­రు. ఈ గె­లు­పు­తో RCB తొలి బోణీ కొ­ట్ట­గా.. అభి­మా­ను­లు పండగ చే­సు­కుం­టు­న్నా­రు.

అనూహ్య విజయం

పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. అయినప్పటికీ గ్రేస్‌ హారిస్‌ (25), స్మృతి మంధాన (18) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ 25 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ స్కోరు 65/5కి చేరి ఓటమి దిశగా సాగుతున్నట్లు కనిపించింది. ఈ దశలో ముంబయి విజయం ఖాయమన్న భావన అభిమానుల్లో నెలకొంది. అయితే అక్కడే మ్యాచ్‌ కథ మలుపు తిరిగింది. క్రీజులోకి వచ్చిన నదైన్‌ డి క్లెర్క్‌ పూర్తిగా భిన్నమైన ఆటతీరును ప్రదర్శించింది. మొదట పరిస్థితిని అర్థం చేసుకుని సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరును ముందుకు నడిపించిన ఆమె, చివరి ఓవర్లలో గేర్‌ మార్చింది. చివరి ఓవర్‌లో ఆర్సీబీకి 18 పరుగులు అవసరమైన వేళ, డి క్లెర్క్‌ వరుసగా భారీ షాట్లు బాదుతూ ముంబయి బౌలర్లను షాక్‌కు గురి చేసింది. చివరి నాలుగు బంతుల్లో ఆమె ఆడిన సిక్సులు, ఫోర్లు స్టేడియాన్ని ఉర్రూతలూగించాయి. ఒత్తిడిని లెక్కచేయకుండా ఆడిన ఆ ఇన్నింగ్స్‌ క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయేలా మారింది. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన నదైన్‌ డి క్లెర్క్‌ ఆర్సీబీ విజయానికి అసలైన శిల్పిగా నిలిచింది. ఆమె అద్భుత ప్రదర్శనకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Tags:    

Similar News