ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ ( Manu Bhaker ) నిన్న ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీని ( Sonia Gandhi ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన పతకాలను సోనియాకు చూపించి, ఒలింపిక్స్ విశేషాలను పంచుకున్నారు. కాగా మనూ భాకర్ మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్‌గా మను వ్యవహరించనున్నారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, సరబ్ జోత్ సింగ్‌తో కలిసి మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యాలు సాధించిన మను భాకర్... మహిళల 25 మీటర్ల విభాగంలో తృటిలో పతకం కోల్పోయింది. ఈరోజు ఆమె పారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.