పహల్గాం ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెబుతోంది. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పాక్ సారథి మహ్మద్ రిజ్వాన్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు పేసర్ షాహిన్ అఫ్రీది సోషల్ మీడియా అకౌంట్లను ఇండియా లో బ్యాన్ చేసింది. వీరి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను కేంద్రం నిలిపివేసింది. అంతకుముందు పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ ఇన్స్టా, యూ ట్యూబ్ ఖాతాలను కూడా మన దేశంలో నిలిపివేశారు.