ICC Warns : టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ఐసీసీ వార్నింగ్!

Update: 2025-01-22 12:00 GMT

టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్‌నేమ్ పాకిస్థాన్‌ను ముద్రించకుండా ఉండేందుకు ఐసీసీ అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ రిక్వెస్ట్‌ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్‌నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

అంతకుముందు పీసీబీ మాట్లాడుతూ.. ”బీసీసీఐ క్రికెట్లోకి రాజకీయాలను తెస్తోంది. దీని వల్ల ఆటకు నష్టం కలుగుతుంది. మొదటగా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి తిరస్కరించారు. ట్రోఫీ ప్రారంభ వేడుకలకు కెప్టెన్‌ను పంపించడం లేదు. ఇప్పుడేమో టీమిండియా జెర్సీలపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్‌) పేరును ముద్రించడం లేదు” అని విమర్శించింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News