PANT: టీమిండియాకు బిగ్ షాక్... రిషబ్ పంత్ అవుట్..?
పంత్ స్థానంలో జగదీషన్ కు చోటు;
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్‌కు తీవ్రగాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి గాయమైంది.బంతి తగిలిన చోట విపరీతమైన వాపు వచ్చింది. అంతేకాకుండా గాయమైన కుడి పాదంపై నిలబడలేకపోయాడు. కనీసం నడవలేకపోయాడు. అయితే స్కానింగ్ చేయగా.. బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలిందని సమాచారం. దీంతో అతడు పూర్తిగా కోలుకునేందుకు కనీసం 6 వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తడు పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కనీసం 6 వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిషభ్ పంత్ .. ఈ మ్యాచుతో పాటు ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్కానింగ్ నివేదికలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. అతడు ఆరు వారాల పాటు ఆట నుంచి దూరంగా ఉంటాడు. నొప్పిని తగ్గించే మందులు ఇచ్చి అతడిని మళ్లీ బ్యాటింగ్ చేయించడానికి మెడికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే, అతడు నడవడానికి ఇంకా సహాయం అవసరం కాబట్టి, బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి” అని బీసీసీఐ తెలిపింది. మాంచెస్టర్ టెస్ట్‌కు పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అయితే, జురెల్ ప్రస్తుత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేడు. ఇది టీమిండియాకు ఒక బ్యాటర్ తక్కువగా ఉండేలా చేస్తుంది. దాంతో అతడు నాలుగో టెస్టుతో పాటు ఐదో టెస్టుకు కూడా దూరం కానున్నాడు. అంతేకాకుండా ఆగస్టు నెల మొత్తం ఆటకు దూరం కానున్నాడు. సెప్టెంబర్‌లో తిరిగి అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది.
జగదీషన్ కు స్థానం ఖాయమేనా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్ గాయపడటంతో నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్ చేయడం అసాధ్యమే. గాయమైన పాదానికి ఆర్థోపెడిక్ బూట్ వేసుకుని వచ్చిన పంత్ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. దీంతో టీమిండియా ఐదవ టెస్ట్‌కు తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తొలి వికెట్ కీపర్‌గా పంత్..
గాయం కాక ముందే రిషభ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై 1000 రన్స్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. రిషభ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై.. 1018 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 146. పంత్ మినహా ప్రపంచంలో మరే వికెట్ కీపర్ కూడా.. విదేశీ గడ్డపై 1000 పరుగులు చేయకపోవడం గమనార్హం.