Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్

మరోసారి బరిలో దిగనున్న మోనా అగర్వాల్, అవని లేఖరా;

Update: 2024-09-03 02:00 GMT

పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో సోమవారం భారత అథ్లెట్ లు   అద్భుతం చేశారు. ఒకేరోజు    ఏకంగా ఆరు పతకాలు  సాధించారు. షూటర్ నితేశ్‌ కుమార్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఎస్‌ఎల్‌-4లో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. మహిళా షూటర్లు తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్‌దాస్‌ కాంస్యం సాధించారు. డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కతూనియా రజత పతకం గెలిచాడు. ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ జోడి కాంస్యం సాధించింది. ఇప్పటివరకు భారత్ 15 మెడల్స్ ఖాతాలో వేసుకుంది. వాటిలో 3 బంగారు పతకాలు, 5 రజత పతకాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి, నేడు కూడా మనకు కీలక పోటీలు ఉన్నాయి. నేటి భారత షెడ్యూల్ను ఓసారి చూద్దాం.


భారత షెడ్యూల్:

షూటింగ్‌:

మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్స్‌ (క్వాలిఫికేషన్స్‌): మోనా అగర్వాల్, అవని లేఖరా, మధ్యాహ్నం 1 గంట నుంచి

అథ్లెటిక్స్‌:

మహిళల షాట్‌పుట్, ఎఫ్‌-34 (పతక రౌండ్‌): భాగ్యశ్రీ జాదవ్, మధ్యాహ్నం 2.28 నుంచి

పురుషుల హైజంప్, టీ-63 (పతక రౌండ్‌): తంగవేలు మరియప్పన్, శరద్‌కుమార్, శైలేష్‌ రా.11.50 నుంచి

మహిళల 400మీ పరుగు, టీ20 ఫైనల్‌: దీప్తి జీవాంజి; రాత్రి 10.38

పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్‌-46 (పతక రౌండ్‌): అజీత్, రింకు, సుందర్‌ గుర్జార్‌; రా.12.13 నుంచి

Tags:    

Similar News