Ravi Shastri : ఇంగ్లాండ్ పర్యటనకు..సాయి సుదర్శన్ ఎంపిక చేయండి! : రవిశాస్త్రి
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్లో రెచ్చిపోతున్నాడు. తనకంటూ ప్రతేకమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అన్ని మ్యాచ్ లలో కూడా మంచి స్కోర్ చేశాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ 456 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా జట్టు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటన కు పోనుంది. ఆ టూర్ కు సాయి సుదర్శన న్ను సెలెక్ట్ చేయాలన్న అభిప్రాయాలు అందరి నుంచి వస్తున్నా యి. భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా సాయి సుదర్శనకు సపోర్టుగా నిలిచాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు అతను సరిగ్గా సరిపోతా డన్నాడని అన్నారు. సాయి సుదర్శన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని మెచ్చుకున్నాడు. 'లెఫ్ట్ హ్యాండర్ కావడం, ఇంగ్లాండ్ పరిస్థితులు తెలిసి ఉండటం, అతని టెక్నిక్, ఆడే విధానం వంటి కారణాలతో అతను జట్టులో కచ్చి తంగా ఉంటాడని నమ్ముతున్నా.' అని శాస్త్రి తెలిపాడు. సాయికి ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం కూడా ఉందని తెలిపారు. కౌంట్ చాంపియన్ షిప్ ఆడిన నేపథ్యంలో అతను భారత్ తరపున ఎక్స్ ఫ్యాక్టర్ కానున్నాడని స్పష్టం చేశారు. అయితే, సాయి ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదని, ఇప్పటివరకు భారత్ తరపున 3 వన్డేలు ఆడిన అతను రెండు మ్యాచ్ హాఫ్ సెంచరీలు చేశాడని అన్నారు. ఓపెనర్ స్థానం కోసం తీవ్ర పోటీ నేపథ్యంలో అతనికి ఎక్కువ ఛాన్స్ లు రాలేదని రవి శాస్త్రి తెలిపాడు.