RAVISHASTRY: ఓటములకు వంద శాతం బాధ్యత గంభీర్‌దే

గంభీర్‌పై పెరుగుతున్న విమర్శల హోరు

Update: 2025-12-02 09:19 GMT

టీ­మిం­డి­యా టె­స్టు­ల్లో పత­నం­పై మాజీ కోచ్ రవి­శా­స్త్రి తీ­వ్ర అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­డు. ఆట­గా­ళ్ల బా­ధ్య­త­ను ప్ర­శ్ని­స్తూ, గం­భీ­ర్ నా­య­క­త్వం­లో జట్టు వై­ఫ­ల్యా­ల­పై వి­మ­ర్శ­కు­లు మం­డి­ప­డు­తు­న్న వి­ధా­నం­పై రవి­శా­స్త్రి స్పం­దిం­చా­డు. తన హయాం­లో ఇలా­ జరి­గి ఉంటే పూ­ర్తి బా­ధ్యత తానే తీ­సు­కు­ని ఉం­డే­వా­డి­ని అంటూ ఇం­ట­ర్వ్యూ­లో చె­ప్పు­కొ­చ్చా­డు. ద్ర­వి­డ్ తర్వాత గం­భీ­ర్ వచ్చాక పరి­స్థి­తి మా­రిం­ద­ని నె­టి­జ­న్లు అం­టు­న్నా­రు. వరుస ఓట­ము­ల­తో వర­ల్డ్ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్ ఫై­న­ల్ అవ­కా­శా­లు కూడా భా­ర­త్ కష్ట­త­రం చే­సు­కుం­ది. ‘గు­వా­హ­టి టె­స్టు­లో భా­ర­త్ టాప్ ఆర్డ­ర్ వి­ఫ­ల­మైం­ది. అలా అని టీ­మ్ఇం­డి­యా పే­ల­వ­మైన జట్టు కాదు. మన ఆట­గా­ళ్లు ఎంతో ప్ర­తి­భా­వం­తు­లు. వా­రి­కి స్పి­న్ బౌ­లిం­గ్ ఎదు­ర్కో­వ­డం కొ­త్త కాదు. చి­న్న­ప్ప­టి నుం­చి స్పి­న్ ఆడు­తు­న్నా­రు. కా­బ­ట్టి, కచ్చి­తం­గా వారు మరింత బా­ధ్యత తీ­సు­కు­ని ఆడా­లి’ అని రవి­శా­స్త్రి వి­వ­రిం­చా­డు. జట్టు పేలవ ప్ర­ద­ర్శన వి­ష­యం­లో హె­డ్‌ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్‌­ను మీరు రక్షి­స్తు­న్నా­రా? అని ప్ర­శ్నిం­చ­గా.. ‘నేను అత­డి­ని కా­పా­డ­టం లేదు. 100 శాతం అతను కూడా బా­ధ్యత తీ­సు­కో­వా­లి.కానీ, జట్టు సమా­వే­శం­లో ఆట­గా­ళ్ల­ను కచ్చి­తం­గా ప్ర­శ్నిం­చే­వా­డి­ని’ అని సమా­ధా­న­మి­చ్చా­డు.

టీమిండియా కోచ్‌గా సెహ్వాగ్..

హెడ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ ఆధ్వ­ర్యం­లో భా­ర­‌త జ‌­ట్టు వరు­స­గా టె­స్ట్ సి­రీ­స్ లు కో­ల్పో­తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. సొంత గడ్డ­పై గ‌­తం­లో న్యూ­జి­లాం­డ్, మొ­న్న దక్షి­ణా­ఫ్రి­కా చే­తి­లో భారత జట్టు వైట్ వాష్ అయిం­ది. గౌ­త­మ్ గం­భీ­ర్ తీ­సు­కుం­టు­న్న చె­త్త ని­ర్ణ­యాల కా­ర­ణం­గా, సొం­త­గ­డ్డ­పై కూడా భారత జట్టు వి­ఫ­ల­మ­వు­తోం­ద­‌­ని వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. అభి­మా­ను­ల­తో పాటు మాజీ క్రి­కె­ట­ర్లు కూడా ఈ అం­శం­పై ఫైర్ అవు­తు­న్నా­రు. ఇక చాలా మంది అభి­మా­ను­లు అయి­తే, కోచ్ పద­వి­ని తొ­ల­గిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. గౌ­త­మ్ గం­భీ­ర్ స్థా­నం­లో రవి శా­స్త్రీ­ని మరో­సా­రి కో­చ్‌­గా తీ­సు­కో­వా­ల­ని కొం­త­మం­ది డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. మరి కొం­త­మం­ది మహేం­ద్ర సిం­గ్ ధో­ని­కి ఛా­న్స్ ఇవ్వా­ల­ని అం­టు­న్నా­రు. అయి­తే నే­ష­న­ల్ మీ­డి­యా క‌­థ­‌­నా­ల‌ ప్ర­కా­రం, టి20 వర­ల్డ్ కప్ అయి­పో­యే వరకు గౌ­త­మ్ గం­భీ­ర్ కోచ్ గా కొ­న­సా­గు­తా­డట. ఆ తర్వాత అత­న్ని తప్పిం­చే ఛా­న్స్ లో ఉన్న­ట్లు సమా­చా­రం అం­దు­తోం­ది. అదే జరిగితే గౌతమ్ గంభీర్‌ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కు అవకాశం రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. భారత జట్టుకు గతంలో సుదీర్ఘకాలం పాటు వీరేంద్ర సెహ్వాగ్ సేవలందించాడు.

Tags:    

Similar News