Rohit Sharma : రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు

Update: 2024-08-06 15:45 GMT

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డేల్లో మరో రికార్డుకు చేరువయ్యారు. మరో రెండు సిక్సులు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం 331 సిక్సులతో క్రిస్ గేల్ రెండోస్థానంలో ఉండగా రోహిత్ ఖాతాలో 330 సిక్సులున్నాయి. రేపు కొలంబోలో జరిగే మూడో వన్డేలో రోహిత్ ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో 351 సిక్సులతో షాహిద్ ఆఫ్రిది అగ్రస్థానంలో ఉన్నారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో చివరి వన్డేకు సిద్ధమైంది భారత జట్టు. బుధవారం కొలంబో వేదికగా చివరిదైన మూడో వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే టై అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించి.. సిరీస్‌లో 0-1తో ముందంజలో ఉంది. చివరి వన్డే కూడా గెలిస్తే శ్రీలంక 0-2తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

అయితే.. లంకకు ఆ అవకాశం ఇవ్వకుండా.. ఎలాగైన మూడో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గెలవాల్సిన తొలి టై కావడం, రెండో వన్డేలో బ్యాటింగ్‌ వైఫల్యంతో ఓటమిపాలు కావడంతో రోహిత్‌ సేన ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. మూడో వన్డేలో గెలిచేందుకు పటిష్టమైన ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగనుంది.

Tags:    

Similar News