Yuvraj Singh : పాక్‌పై రోహిత్ 60 బంతుల్లో సెంచరీ కొడతాడు : యువరాజ్ సింగ్

Update: 2025-02-22 13:15 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్‌-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. హిట్ మ్యాన్ లేజీగా ఉన్నా చాలా ప్రత్యేకమని కొనియాడారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేశారని తెలిపారు. 2008లో ఓ ట్రై సిరీస్‌ ఆడుతున్న సమయంలో అతనిలో సత్తా ఉందని గమనించినట్లు పేర్కొన్నారు. రోహిత్ 10 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే తర్వాత వచ్చే బ్యాటర్లకు ఆట ఈజీగా ఉంటుందన్నారు.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులో 60 బంతుల్లోనే సెంచరీ చేస్తారని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఫామ్‌లో ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదని చెప్పారు. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీతో పాటు రోహిత్ గొప్ప మ్యాచ్ విన్నర్ అని ప్రశంసించారు. పాకిస్థాన్‌పై 19 వన్డేలు ఆడిన హిట్ మ్యాన్ 51.35 సగటుతో 873 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Tags:    

Similar News