IPL: హ్యారీ బ్రూక్‌పై నిషేధం

రెండు సీజన్లు పాల్గొనకుండా నిషేధం... సమర్థించిన మైకెల్ వాన్;

Update: 2025-03-22 04:00 GMT

ఇండియన్ ప్రీమిర్ లీగ్ 2025లో హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్.. హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో ఎంపికైన తర్వాత బ్రూక్ హాజరు కాకపోవడంతో బీసీసీఐ రెండు సీజన్ల ఐపీఎల్లో ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ సమర్థించాడు. సరైన కారణం లేకుండా హ్యారీ బ్రూక్‌ ఐపీఎల కు హాజరు కానందువల్లే బీసీసీఐ ఈ చర్య తీసుకుందన్నాడు.

అభిమానులకు తీపి కబురు

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేసి స్టేడియం వాతావరణాన్ని తలపించేలా లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్, మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ జోన్, కిడ్స్ ప్లే ఏరియాలకు ప్లాన్ చేసింది. నిజామాబాద్‌లో ఏప్రిల్ 5, 6, HYDలో మే 10, 11, విజయవాడలో మే 17, 18, కాకినాడలో మే 23, 25 తేదీల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఉప్పల్ స్టేడియంలో వాటిపై నిషేధం

ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 23న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో హైదరాబాద్ రాచకొండ పోలీసులు.. ఈ మ్యాచ్ కోసం భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. స్టేడియం ఎంట్రన్స్‌ దగ్గర స్నిపర్‌ డాగ్స్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయనున్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ తో పాటు అగ్గిపెట్టెలు, ల్యాప్‌టాప్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించారు.

చెన్నైలోని రోడ్డుకు అశ్విన్ పేరు!

భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గౌరవార్థం చెన్నైలోని ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టే అవకాశం ఉందని సమాచారం. అశ్విన్ నివాసం ఉన్న వెస్ట్ మాంబళం ప్రాంతంలోని రామకృష్ణాపురం ఫస్ట్ స్ట్రీట్‌కు ఆయన పేరును పెట్టాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు 'క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్' ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌తో అశ్విన్ IPL కూడా వీడ్కోలు పలకవచ్చు.

Tags:    

Similar News