sachin: ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్ కైవసం : సచిన్

భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుందన్న మాస్టర్ బ్లాస్టర్;

Update: 2025-06-21 05:45 GMT

భా­ర­త్‌, ఇం­గ్లం­డ్ సి­రీ­స్‌­పై క్రి­కె­ట్‌ ది­గ్గ­జం, మా­స్ట­ర్ బ్లా­స్ట­ర్ సచి­న్ టెం­డూ­ల్క­ర్‌‌ చే­సిన వ్యా­ఖ్య­లు వై­ర­ల్ అవు­తు­న్నా­యి. శు­భ్‌­మ­న్‌ గిల్ సా­ర­ధ్యం­లో­ని భారత జట్టు ఇం­గ్లం­డ్‌­పై 3‌‌-1 తే­డా­తో సి­రీ­స్‌­ను కై­వ­సం చే­సు­కుం­టుం­ద­ని సచి­న్ జో­స్యం చె­ప్పా­రు. అం­తే­కా­దు, ఈ సి­రీ­స్‌­లో జస్‌­ప్రీ­త్‌ బు­మ్రా కీ­ల­క­పా­త్ర పో­షి­స్తా­డ­ని ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­డు. అయి­తే, సొం­త­గ­డ్డ­పై ఇం­గ్లం­డ్‌­ను ఓడిం­చ­డం అంత తే­లిక కా­ద­ని, అయి­తే టీ­మిం­డి­యా తల­చు­కుం­టే అది సా­ధ్య­మే­న­ని తె­లి­పా­డు. భా­ర­త్‌, ఇం­గ్లాం­డ్‌ మధ్య ఐదు టె­స్టుల సి­రీ­స్‌­లో భా­గం­గా మొ­ద­టి టె­స్టు శు­క్ర­వా­రం మధ్యా­హ్నం 3:30 ని­మి­షా­ల­కు మొ­ద­లైన సం­గ­తి తె­లి­సిం­దే. రన్ మె­షీ­న్ వి­రా­ట్ కో­హ్లీ, హి­ట్‌ మ్యా­న్ రో­హి­త్ శర్మ లే­కుం­డా టీ­మిం­డి­యా టె­స్టు సి­రీ­స్‌ ఆడు­తోం­ది.సొంత ని­ర్ణ­యా­లే బె­స్ట్‌..కీలక దశలో టీ­మిం­డి­యా టె­స్టు జట్టు బా­ధ్య­త­లు తీ­సు­కుం­టు­న్న గి­ల్‌­కు సచి­న్ టెం­డూ­ల్క­ర్‌‌ కీలక సల­హా­లి­చ్చా­డు. ఎవరి మా­ట­లు వి­న­కుం­డా సొంత ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు సా­గి­పో­వా­ల­ని సూ­చిం­చా­డు. ఒక ప్లే­య­ర్ కె­ప్టె­న్‌­గా ఎం­పి­కైన సమ­యం­లో ‘అలా చెయ్.. ఇలా చెయ్..’ అని సల­హా­లు ఇస్తుం­టా­ర­ని, వా­టి­ని ఎక్కు­వ­గా పట్టిం­చు­కో­వ­ద్ద­ని సచి­న్ చె­ప్పు­కొ­చ్చా­డు

ఏడేండ్ల తర్వాత జట్టులోకి ‘కరుణ్‌’

దాదాపు ఏడేండ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్‌ నాయర్. భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో కరుణ్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫలో అత్యుత్తమ ప్రదర్శనతో కరుణ్‌ ఆకట్టుకోవడంతో ఇంగ్లాండ్‌ పర్యటన కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్‌ ఎంపికయ్యాడు. అయితే, ఆ సిరీస్ మొత్తం బెంచీకే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి టెస్టు జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం.. కరుణ్‌కు కలిసొచ్చొందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. "కరుణ్‌ నాయర్‌.. రెడీ టు గో..!" అంటూ బీసీసీఐ పోస్టు చేసి, సిరీస్‌ మొదలయ్యే ముందు అతను మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్ చేసింది.

Tags:    

Similar News