Sarfaraz Khan : రెండో టెస్టు నుంచి సర్ఫరాజ్‌ ఔట్?

Update: 2024-09-24 14:00 GMT

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ కు నిరీక్షణ తప్పేటట్లు లేదు. మొదటి టెస్టులో ఆడే చాన్స్ దక్కని సర్ఫరాజ్‌ ఖాన్‌కు.. రెండో టెస్టులో కూడా చోటు దక్కే అవకాశాలు దాదాపు కనపడట లేవు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాతో రెండో టెస్టు జట్టు నుంచి సర్ఫరాజ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అతడిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో ఇరానీ కప్ జరగనుంది. ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరానీ కప్ కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌ను ముంబై జట్టులో చేర్చాలని బీసీసీఐ చూస్తోంది. భారత జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లకు గాయాలు లేదా ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే.. సర్ఫరాజ్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోందట. ఒకవేళ చివరి నిమిషాల్లో ఎవరైనా గాయపడినా.. లక్నో నుంచి కాన్పూర్ చేరుకోవడానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి పెద్దగా సమస్య ఉందని బీసీసీఐ భావిస్తోంది. అదే సమయంలో కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు.

Tags:    

Similar News