Sarfaraz Khan : బెంగళూరులో సెంచరీతో ఆదుకున్న సర్ఫరాజ్..

Update: 2024-10-19 10:51 GMT

న్యూజిలాండ్ తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు, సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్ లో సర్ఫరాజ్ కు ఇదే తొలి సెంచరీ. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఓవర్ నైట్ స్కోర్ 70 పరుగుల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సర్ఫరాజ్ వేగంగా తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసిన అతను.. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ సెంచరీతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో పరువు నిలబెట్టుకుంది. నాలుగో రోజు ఆటలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సిఉంది.

Tags:    

Similar News