SANIA: పేరెంట్స్‌కు సానియా కీలక సూచనలు
పిల్లల ఆటపాటలు, ఫిట్ నెస్‌పైనా దృష్టి పెట్టాలని హితోపదేశం;
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటలో.. జీవితంలో ఒడుదొడుకులు ఎన్నో ఎదుర్కొన్న సానియా తన కొత్త ప్రయాణం పై స్పష్టత ఇచ్చారు. 15 ఏళ్లకే ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన సానియా...సుదీర్ఘ కాలంగ ఆటలో కొనసాగారు. ఎన్నో గాయాలు, మరెన్నో వివాదాలు ఎదుర్కొన్నారు. డబుల్స్‌లో నంబర్‌వన్‌గా ఎదిగారు. కాగా, కొద్ది రోజులుగా సానియా మీర్జా జీవితంలో తీసుకొనే నిర్ణయాల పైన పలు ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు సానియా తన లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. చిన్నారుల కోసం టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. సీసా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె.. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలన్నారు. ఫిట్‌గా ఉంటే చిన్నారుల్లో విశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, ఆ మూమెంట్‌లో బతకడం అనేవి నేర్చుకుంటారని సానియా చెప్పారు.
ఎన్నో ఒడుదొడుకులు
టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సానియా మిర్జా కొన్ని నెలల క్రితం భర్త నుంచి విడిపోయారు. ఇప్పుడు తన కుమారుడు భవిష్యత పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం టెన్నిస్ ఆటలో తనదైన ముద్ర వేసిన సానియా 2022 లో ఆటకు గుడ్ బై చెప్పారు. సానియా మిర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు చిన్నారుల ఫిట్ నెస్, చదువు కోసం వినూత్న తరహాలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సీసా స్పేసెస్ తో తాజాగా సానియా మీర్జా అడుగు వేయాలని నిర్ణయించారు. ఈ సంస్థతో కలిసి ఈ ఏడాది కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సానియా ప్రకటించారు. సీసా స్పేసెస్ కు సంస్థ భాగస్వామలు చిరంజీవి కుమార్తె శ్రీజతో కలిసి ఈ ప్రకటన చేసారు.