WARNE: షేన్ వార్న్ మృతిపై కొత్త కోణం
ఘటనాస్థలంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధ బాటిల్ లభ్యం;
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై సరికొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ సీనియర్ పోలీసు అధికారి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. వార్న్ చనిపోయిన స్థలంలో వాంతులు, రక్తపు మరకలతో పాటు లైంగిక సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్స్ లభించాయని తెలిపాడు. దీనిని ఉన్నతాధికారులు కప్పిపుచ్చారని అన్నాడు. అయితే వైద్యులు మాత్రం వార్న్‌ది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. వార్న్ చనిపోయిన సమయంలో ఘటనా స్థలానికి వెళ్లిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇటీవల కీలక విషయాలు వెల్లడించారు. ఘటనా స్థలానికి వెళ్లగా.. అక్కడ ఓ ఔషధ బాటిల్‌తో పాటు వాంతులు, రక్తపు మరకలు కనిపించాయని వెల్లడించాడు.
ఆ పోలీసు అధికారి ఏం చెప్పాడంటే..
లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఆ ఔషధ బాటిల్ ఘటనా స్థలంలో లభ్యమైందని, దాన్ని అక్కడనుంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఆ మాత్రలను అక్కడ నుంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని.. తాము వాటిని తొలగించామని తెలిపాడు. ఆ మాత్రలను వార్న్ ఎంత మోతాదులో తీసుకున్నాడనే విషయం తెలియదని ఆ పౌలీసు అధికారి వెల్లడించాడు. ఇది చాా సున్నితమైన అంశమని పేర్కొన్నాడు. దీనిని కప్పిపుచ్చే’ వ్యవహారంలో ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉండవచ్చని అన్నాడు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయి ద్వీపంలోని విల్లాలో షేన్‌వార్న్ 2022 మార్చి 4న హఠాన్మరణం చెందారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆవేదనకు గురిచేసింది.