India vs Bangladesh: సెంచరీలతో అదరగొట్టిన గిల్, పంత్.. బంగ్లా ముందు భారీ టార్గెట్
బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం.;
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 5 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ 17 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున మెహదీ హసన్ మిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా చెరో వికెట్ తీశారు.
ఈ క్రమంలో 634 రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగుల వద్ద పంత్ అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. 128 బంతుల్లో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఆరు సెంచరీలు)ను కూడా సమం చేశాడు. ఇక మరోవైపు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టాడు. సెంచరీతో అతనిపై వస్తున్న ట్రోల్ల్స్ కి చెక్ చెప్పాడు.