భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆమె నిలిచారు. ఇప్పటివరకు స్మృతి 30సార్లు 50కిపైగా పరుగులు బాదారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. వీరి తర్వాత బెత్ మూనీ (25), స్టెఫానీ టేలర్ (22), సోఫీ డివైన్ (22), వైట్ (20) ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్ లో 77 పరుగులు చేసిన స్మృతి.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డులకెక్కింది. తాజా ఇన్నింగ్స తో ఈ ఏడాది 21 ఇన్నింగ్స్ లో 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు చమరి ఆటపట్లు (21 ఇన్నింగ్స్-720 పరుగులు) పేరిట ఉండేది. తాజా ఘనతలతో ఈ ఏడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు గట్టి పోటీగా నిలిచింది.