ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గాలేలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో సెంచరీతో చెలరేగాడు. స్మిత్ కు ఇది 35వ టెస్ట్ సెంచరీ. అతనికి విదేశీ గడ్డపై చేసిన 17వ సెంచరీ. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డును స్మిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ల జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 16 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండేది. తాజాగా స్మిత్ 17వ శతకంతో కోహ్లీని ఓవర్ కమ్ చేశాడు. ఇదే టెస్టులో స్మిత్ మరో అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టెస్టుల్లో 10వేల పరుగుల మార్క్‌ను చేరాడు. స్మిత్ కంటే ముందు ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.