IPL: ఇషాన్.. తుఫాన్

శతకంతో చెలరేగిన ఇషాన్ కిషన్... తొలి మ్యాచులోనే హైదరాబాద్ భారీ స్కోరు;

Update: 2025-03-24 01:30 GMT

ఐపీఎల్‌-18ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...విధ్వంసంతో మొదలుపెట్టింది. ప్రత్యర్థి బౌలర్లను తుత్తునీయలు చేస్తూ భారీ స్కోరు చేసింది. గత సీజన్‌లో మూడుసార్లు 250కిపైగా స్కోర్లు సాధించిన హైదరాబాద్.. తొలి మ్యాచులోనే మరోసారి ఆ ఘనతను సాధించింది. తొలి పోరులో, పైగా సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 250కు పైగా స్కోరు బాదేసింది. ముంబై ఇండియన్స్‌ నుంచి సన్‌రైజర్స్‌కు మారాక తొలి మ్యాచ్‌ బరిలో దిగిన ఇషాన్‌ కిషన్‌ శతక గర్జనతో అలరించాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు తుపాను వేగంతో బ్యాటింగ్ చేయగా..దానిని ఇషాన్ సునామీలా మార్చేశాడు. ఈ మ్యాచులో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. అనంతరం నిర్ణీత 20 ఓవర్లు రాజస్థాన్ ముగిసే 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది ధ్రువ్‌ జురేల్‌ (70), సంజు శాంసన్‌ (66) మెరుగైన ప్రదర్శన చేసినా ఫలితం లేకపోయింది.

ఇషాన్ శతక గర్జన

ఈ మ్యాచులో ఇషాన్‌ కిషన్‌ 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సూపర్‌ సెంచరీతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67), క్లాసెన్‌ (14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 34), నితీశ్‌ కుమార్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 30) మెరిశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్‌ మూడు, మహీశ్‌ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 242/6 స్కోరుకే పరిమితమై ఓడింది. ధ్రువ్‌ జురెల్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), సంజూ శాంసన్‌ (37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. హెట్‌మయెర్‌ (23 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లతో 42), శుభమ్‌ దూబే (11 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లతో 34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. హర్షల్‌ పటేల్‌, సిమర్జీత్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

హైదరాబాద్ రికార్డుల హోరు

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్‌లో పలు రికార్డ్స్ నమోదు అయ్యాయి. ఐపీఎల్‌లో వరుసగా 4వసారి ఆర్‌ఆర్‌ను SRH ఓడించగా.. మ్యాచ్‌లో ఏకంగా 30 సిక్సర్లు నమోదు అయ్యాయి. రెండు జట్లు కలిపి 528 పరుగులు రాబట్టాయి. ఇది IPL చరిత్రలో రెండవ అత్యధిక మ్యాచ్ మొత్తం. RR పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.

Tags:    

Similar News