ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు.. అయిదు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ 180 పరుగులకే పరిమితమైంది. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్ శర్మ పంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు....... కావాల్సి ఉండగా 26 పరుగులే వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ 27 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు. 15 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసిన ట్రానిస్ హెడ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్ తొలి షాక్ ఇచ్చాడు. అదే స్కోరుపై మార్క్రమ్ కూడా అవుటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్...హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి తన ఆటతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. హర్ ప్రీత్ బార్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదిన నితీశ్ 32 బంతుల్లోనే అర్థ శతకం మార్క్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన నితీశ్ కూడా పెవిలియన్ చేరాడు. మళ్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అర్ష్‌దీప్ షాక్ ఇచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, శామ్‌కరణ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే బెయిర్ స్టోను కమిన్స్ అవుట్ చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 4, ధావన్ 14, శామ్ కరణ్ 29, సికిందర్ రాజా 28 పరుగులకు పెవిలియన్ చేరడంతో పంజాబ్ ఓటమి ఖారారని అందరూ భావించారు. కానీ శశాంక్‌సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి..... పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్ శర్మ పంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు కావాల్సి ఉండగా 26 పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.