T20: ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన
లండన్ పర్యటనకు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ;
వచ్చే నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్‌లోనే పర్యటించనుంది. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనకు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇటీవలే హర్మన్‌ప్రీత్ సేన.. శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి టచ్‌లో ఉంది. ఇక జూన్ చివర్లో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ టూరులో పాల్గొనే వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ తిరిగి టీ20 జట్లులోకి పునరాగమనం చేసింది. ఏడాది కాలంగా ఆమె జాతీయ జట్టుకు దూరంగా ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటడంతో సెలెక్టర్లు ఆమెకు చాన్స్ ఇచ్చారు. హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా, స్నేహ్ రాణా కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. ట్రై సిరీస్‌లో స్నేహ్ రాణా 15 వికెట్లతో ప్లేయర ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలకు రెండు జట్లలో స్థానం దక్కింది. ఇటీవల ట్రై సిరీస్‌లో శ్రీ చరిణి భారత్ తరపున అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. వచ్చే నెల 28న ఇరు జట్లు తొలి టీ20లో తలపడతాయి.
చాలా రోజుల తర్వాత జట్టులోకి షెఫాలి
స్టార్ ఓపెనర్ షెఫాలివర్మ భారత మహిళల జట్టులో ఏడు నెలల విరామం తర్వాత పునరాగమనం చేసింది. టీ20 జట్టులో చోటు సంపాదించిన షెఫాలికి 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రం స్థానం దక్కలేదు. 2024 అక్టోబర్‌లో జాతీయ జట్టుకు ఆడిన ఆమె... డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ తరఫున మెరిసింది. 152 స్ట్రైక్‌రేట్‌తో 304 పరుగులు చేసింది.
వన్డే జట్టు : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, ప్రాతిక రావల్, హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, తేజాల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే
టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన,షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.